LLC 2022: లెజెండ్స్ లీగ్ క్రికెట్ పూర్తి షెడ్యూల్‌ విడుదల..

23 Aug, 2022 20:01 IST|Sakshi
File Photo

లెజెండ్స్ లీగ్ క్రికెట్ సెకెండ్‌ సీజన్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను టోర్నీ నిర్వాహకులు మంగళవారం విడుదల చేశారు. ఈ టోర్నీ దేశవ్యాప్తంగా ఆరు నగరాల్లో జరగనుంది. లీగ్‌ మ్యాచ్‌లు కోల్‌కతా, న్యూఢిల్లీ, కటక్‌, లక్నో, జోధ్‌పూర్ వేదికగా జరగనున్నాయి. అయితే  ప్లేఆఫ్‌ వేదికలు ఇంకా ఖారారు కాలేదు.

కాగా టోర్నమెంట్‌ ఓ ప్రత్యేకమైన మ్యాచ్‌తో ఆరంభం కానుంది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఇండియా మహరాజాస్‌, వరల్డ్‌ జెయింట్స్‌ మధ్య  సెప్టెంబర్ 16న ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఓ చారటీ మ్యాచ్‌ జరగనుంది.

ఇండియా మహరాజాస్‌కు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ కెప్టెన్‌గా ఎంపిక కాగా.. వరల్డ్‌ జెయింట్స్‌కు ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ సారథ్యం వహించనున్నాడు. అనంతరం సెప్టెంబర్ 17 నుంచి అసలైన టోర్నీ ప్రారంభం కానుంది. కాగా ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు తలపడనున్నాయి.

ఇండియా మహరాజాస్‌ జట్టు:
సౌరవ్‌ గంగూలీ(కెప్టెన్‌), వీరేంద్ర సెహ్వాగ్‌, మహ్మద్‌ కైఫ్‌,యూసఫ్‌ పఠాన్‌, సుబ్రహ్మణ్యం బద్రీనాథ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, పార్థివ్‌ పటేల్‌(వికెట్‌ కీపర్‌), స్టువర్ట్‌ బిన్నీ, ఎస్‌ శ్రీశాంత్‌, హర్భజన్‌ సింగ్‌, నమన్‌ ఓజా(వికెట్‌ కీపర్‌), అక్షశ్‌ దిండా, ప్రజ్ఞాన్‌ ఓజా, అజయ్‌ జడేజా, ఆర్పీ సింగ్‌, జోగీందర్‌ శర్మ, రితేందర్‌ సింగ్‌ సోధి.

లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022 పూర్తి షెడ్యూల్‌
కోల్‌కతా(ఈడెన్‌ గార్డెన్స్‌): సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు
లక్నో: సెప్టెంబర్ 21 నుంచి 22 వరకు
న్యూఢిల్లీ: సెప్టెంబర్ 24 నుంచి 26 వరకు
కటక్(బారాబతి స్టేడియం): 2022 సెప్టెంబర్ 27 నుంచి 30 వరకు
జోధ్‌పూర్: అక్టోబర్1 నుంచి 3 వరకు
ప్లే-ఆఫ్‌లు: అక్టోబర్ 5 నుంచి 7 వరకు(వేదిక ఇంకా ఖారారు కాలేదు)
పైనల్‌: అక్టోబర్ 8(వేదిక ఇంకా ఖారారు కాలేదు)
చదవండి
IND vs PAK: 'రోహిత్‌, రాహుల్‌, కోహ్లి కాదు.. పాకిస్తాన్‌కు చుక్కలు చూపించేది అతడే'

మరిన్ని వార్తలు