IPL2021: చెన్నై జట్టుకు క్షమాపణలు చెప్పిన స్కాట్‌ స్టైరిస్‌

5 Apr, 2021 08:53 IST|Sakshi

ఐపీఎల్‌ సీజన్‌ మొదలయ్యాక ఆటగాళ్లు తమ ఆటతో వార్తల్లో నిలుస్తారు, కానీ ప్రస్తుతం మాత్రం వాళ్లు తమ మాటలతో వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇటీవల చెన్నై జట్టు మాజీ ఆటగాడు, న్యూజిలాండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ స్కాట్‌ స్టైరిస్ ఐపీఎల్‌ 2021 ప్రిడిక్షన్‌ చెప్పిన ‌ సంగతి తెలిసిందే. ఎప్పటిలానే పాయింట్ల పట్టికలో ముంబై మొదటి స్థానంలో ఉంటుందని చెప్పిన, స్టైరిస్‌.. చెన్నై ఈసారి చివరిలో నిలుస్తుందని పేర్కొన్నాడు. అతని వ్యాఖ్యలపై చెన్నై అభిమానులు, ఆటగాళ్లు హర్ట్‌ అయ్యారు.

స్టైరిస్ ప్రిడిక్షన్‌పై స్పందించిన సీఎస్‌కే ఫ్రాంచైజీ కౌంటర్‌ ఎటాక్‌ చేస్తూ.. తమ మాజీ ఆటగాడికి సీఎస్‌కేపై కోపం ఎందుకో అనే అర్ధం వచ్చేలా కౌంటర్‌ ఇచ్చింది. ‘మాజీ మచ్చి.. మాపై ఎందుకు అలా’ అంటూ స్టైరిస్ కోపంతో ఉన్న ఫొటో ఒకదానిని ట్వీట్‌ చేసింది. చెన్నై ఫ్రాంచైజీ కౌంటర్‌ నేపథ్యంలో స్టైరీస్ తాజాగా మరో ట్వీట్‌ చేశాడు.‌ చెన్నైని తక్కువ చేసినందుకు సీఎస్‌కే యాజమాన్యాన్ని క్షమాపణలు కోరుతున్నట్టు ట్వీట్‌లో పేర్కొన్నాడు. ‘నన్ను నేను మందలించుకుంటున్నాను’ అని తెలిపాడు.

కాగా, దుబాయ్‌లో జరిగిన గత ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నై జట్టు ప్రదర్శన అంతగా ఆకట్టుకోలేదు. చివరలో వరుస విజయాలు సాధించినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో తొలిసారి ప్లే ఆఫ్‌ చేరకుండానే ఇంటిదారిపట్టింది. ఈక్రమంలోనే ఎంఎస్‌ ధోని నేతృత్వంలోని సీఎస్‌కే తాజా ఐపీఎల్‌లో ఆఖరి స్థానంలోనే నిలుస్తుందని  స్కాట్‌ స్టైరిస్ జోస్యం చెప్పినట్టున్నాడు.
( చదవండి: అతను దూరమవడానికి పుజారా కారణమా! ) 

మరిన్ని వార్తలు