విరాట్‌ కోహ్లి ఈజ్‌ బ్యాక్‌!

19 Jan, 2021 18:23 IST|Sakshi

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు జట్టు ప్రకటన

కెప్టెన్సీ పగ్గాలు అందుకోనున్న కోహ్లి

న్యూఢిల్లీ: స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌కు జాతీయ సెలెక్షన్‌ కమిటీ మంగళవారం సాయంత్రం భారత జట్టును ప్రకటించింది. పెటర్నిటీ సెలవులపై ఆస్ట్రేలియాతో తొలి టెస్టు అనంతరం భారత్‌కు వచ్చిన విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. ఇషాంత్, హార్దిక్ పాండ్యా జట్టులోకి తిరిగొచ్చారు. ఇక బ్రిస్బేన్‌ టెస్టులో అదరగొట్టిన ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కింది. దాంతోపాటు స్టాండ్‌ బై వికెట్ కీపర్‌గా తెలుగు కుర్రాడు కెఎస్ భరత్ అవకాశం లభించింది. నాలుగు గెస్టుల సిరీస్‌లో భాగంగా ఫిబ్రవరి 5 నుంచి తొలి టెస్టు చెన్నైలో ప్రారంభమవుతుంది. తొలి రెండు టెస్టులకు భారత జట్టు ఇది...

భారత జట్టు: విరాట్‌ కోహ్లీ, అజింక్య రహానె, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, మహ్మద్‌ సిరాజ్, శుభ్‌మన్‌ గిల్, వృద్ధిమాన్‌ సాహా, శార్దూల్‌ ఠాకూర్, మయాంక్‌ అగర్వాల్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్‌ అశ్విన్, చతేశ్వర్‌ పుజారా, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్‌ బుమ్రా, వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌.
(చదవండి: చారిత్రక విజయం: రహానే, రవిశాస్త్రి భావోద్వేగం)

Poll
Loading...
Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు