ఆయన్ని ట్రాప్‌ చేసి వీడియో తీయమన్నారు : మోడల్‌

24 Mar, 2021 12:45 IST|Sakshi

మొనాకొ: టెన్నిస్‌ ప్రపంచ నెంబర్ వన్ .. సెర్బియా స్టార్‌ నోవాక్ జొకోవిచ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇప్పటివరకు  టెన్నిస్‌ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన  జొకోవిచ్ వరల్డ్ చాంపియన్‌గా వరుసగా 311 వారాలు పాటు కొనసాగి రోజర్ ఫెదదర్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు. అంతేకాదు జొకోవిచ్‌ కెరీర్‌లో 18 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌, 82 ఏటీపీ సింగిల్స్‌ టైటిల్స్‌ సాధించాడు.

టెన్నిస్‌ రారాజుగా వెలిగిపోతున్న జొకోవిచ్‌ను చూసి కొందరు గిట్టనివాళ్లు అతని ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్రలు పన్నినట్లు సమాచారం. దీనికోసం  సెర్బియన్‌ మోడల్‌.. ఇన్‌స్టాగ్రామ్‌ స్టార్‌ నటాలియా సెకిచ్‌ను జొకోవిచ్‌ను తప్పుగా చూపించాలంటూ కొందరు వ్యక్తులు సంప్రదించారు. అయితే సదరు మోడల్‌ జొకోవిచ్‌ ప్రతిష్టను దెబ్బతీయడం ఇష్టంలేక వారి ఆఫర్‌ను తిరస్కరించినట్లు తాజాగా ఒక మ్యాగ్‌జైన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పేర్కొంది.''జొకోను లొంగదీసుకొని, అతనితో గడిపిన దృశ్యాలను వీడియోలో బంధించాలి. అలా చేస్తే  60వేల యూరోలు(భారత కరెన్సీలో రూ. 52 లక్షలు) ఇస్తానంటూ తనకు తెలిసిన ఓ వ్యక్తి  ఆఫర్‌ చేశాడు. కానీ జొకోవిచ్‌ అంటే నాకు ఎనలేని అభిమానం. అతని ప్రతిష్టను దెబ్బతీయడం ఇష్టంలేక వారిచ్చిన ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించాను.'' అని తెలిపింది.
చదవండి:
మెద్వెదెవ్‌ మొదటిసారి...
టీమిండియాకు షాక్‌.. కీలక ఆటగాడు దూరం!

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు