కోచ్‌తో టెన్నిస్‌‌ ప్రాక్టీస్‌‌ చేస్తున్న జూనియర్‌ సెలెనా

17 Feb, 2021 20:37 IST|Sakshi

లాస్‌ఎంజెల్స్‌: అమెరికా స్టార్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ సెరెనా విలియమ్స్‌ మూడేళ్ల కూతురు అలెక్సిక్‌ ఒలింపియా టెన్నిస్‌ ఆడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. తన గారాల పట్టి టెన్నిస్‌ కోర్టులో రాకెట్‌తో కుస్తీ పడుతున్న ఈ వీడియోను సెరెనా తన ఇన్‌స్టాగ్రామ్‌లో బుధవారం షేర్‌ చేసింది. ‘టెన్నిస్‌ డైయిరీస్‌’ అంటూ ఈ వీడియోను అభిమానులతో పంచుకుని సెరెనా తెగ మురిసిపోతోంది. ఇందులో అలెక్సిక్‌.. కోచ్‌ ప్యాట్రిక్స్‌తో టెన్సిస్‌ కోర్టులో ప్రాక్టిస్‌ చేస్తూ కనిపించింది. తల్లిలాగే కూతురు కూడా టెన్నిస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఈ దృశ్యం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. అలెక్సిక్‌ తన బుడ్డిబుడ్డి చేతులతో టెన్నిస్‌ రాకెట్‌ పట్టుకుని బంతిని కొట్టెందుకు ప్రయత్నిస్తున్న ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘ఒలింపియాను త్వరలోనే నిజం చేయనుంది’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. 

చదవండి: గారాల పట్టితో సెరెనా విలియమ్స్‌ డాన్స్‌‌

A post shared by Serena Williams (@serenawilliams)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు