‘దొంగ ఏడుపు ఎందుకులే.. పాక్‌ స్పిన్నర్‌ వీడియో చూసి ఫ్యాన్స్‌ ఫైర్‌!’

28 Oct, 2022 20:48 IST|Sakshi

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. ​మొన్న అదృష్టవశాత్తు లీగ్‌ ఫేవరేట్‌గా ఉన్న ఇంగ్లాండ్‌ జట్టును ఐర్లాండ్‌ చేతిలో ఓటమిని చవిచూడటం క్రికెట్‌ ఫ్యాన్స్‌కు మజానిచ్చింది. ఇంతలోనే దాయాది దేశం పాకిస్తాన్‌.. జింబాబ్వే చేతిలో ఓడిపోవడం భారత్‌ ఫ్యాన్స్‌కు కిక్కుఇచ్చింది. 

ఇక, చిన్న జట్టు చేతిలో పాక్‌ జట్టు ఓటమి చెందడం అటు పాకిస్తాన్‌ ఫ్యాన్స్‌కు కూడా మింగుడుపడటం లేదు. పాక్‌ క్రికెటర్ల ఆటపై ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియాతో మ్యాచ్‌లో ఓటమి అనంతరం.. పాక్ జట్టు జింబాబ్వేతో తలపడింది. ఈ మ్యాచ్‌లో అనూహ్యంగా ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. దీంతో పాక్ కెప్టెన్ బాబర్ ఆజాంతో సహా మిగిలిన క్రికెటర్లు షాక్‌లోకి వెళ్లిపోయారు. గ్రౌండ్‌లోనే తమ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా.. పాకిస్తాన్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌ ఎదుట పాక్‌ జట్టు ఆల్‌రౌండర్‌ షాదాబ్‌ ఖాన్‌ కన్నీరుపెట్టుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో షాదాబ్‌ ఖాన్‌.. తన మోకాళ్ల మీద కూర్చుని వెక్కివెక్కి కన్నీరుపెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఇతర ప్లేయర్స్‌ అతడిని ఓదార్చే ప్రయత్నం చేశారు. 

ఈ వీడియో పాక్‌ అభిమానుల కంటపడింది. పాపం వీడియో చూసిన ఫ్యాన్స్‌.. మనోడే కదా అని ఎమోషనల్‌గా ఫీల్‌ అవుతారనుకుంటే.. ఫైర్‌ అయ్యారు. వీడియోపై ట్రోల్స్‌ చేశారు. షాదాబ్ ఓవరాక్షన్ మొదలుపెట్టాడని, ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయి, ఏదో బాగా కష్టపడినట్లు నాటకాలు ఆడుతున్నాడని కామెంట్స్ పెడుతున్నారు. ఇకనైనా ఈ బిల్డప్ తగ్గించుకుంటే మంచిదంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే, వరల్డ్‌కప్‌ ప్రారంభానికి ముందు షాదాబ్‌ ఖాన్‌.. పాక్‌ జట్టుపై ఓవర్‌గా వ్యాఖ్యలు చేశారు. అన్ని జట్ల కంటే తమ టీమ్‌ బౌలింగ్‌ అటాక్‌ డేంజరస్‌గా ఉందన్నాడు. ప్రపంచంలోనే మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ ఓపెనింగ్‌ జోడి(బాబర్‌ ఆజం, రిజ్వాన్‌) తమ జట్టుకు ప్లస్‌ అంటూ కితాబిచ్చాడు. 

ఇది కూడా చదవండి: ఆ బంతి తిరిగి ఉంటే టీమిండియాకు రిటైర్మెంట్‌ ఇచ్చేవాడిని!

>
మరిన్ని వార్తలు