Shadab Khan: అసలు మీ ఇద్దరు ఏమనుకుంటున్నారు? నేనింకా చిన్న పిల్లాడినే కదా!

23 Nov, 2022 14:23 IST|Sakshi
షాదాబ్‌ ఖాన్‌- బాబర్‌ ఆజం, హసన్‌ అలీ (PC: Twitter)

Shadab Khan: పాకిస్తాన్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌ వైస్‌ కెప్టెన్‌ షాదాబ్‌ ఖాన్‌, ఆ జట్టు పేసర్‌ హసన్‌ అలీ మధ్య జరిగిన సరదా సంభాషణ నెటిజన్లను ఆకర్షిస్తోంది. అలీ కామెంట్‌కు షాదాబ్‌ బదులిచ్చిన తీరుపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు అతడి ఫాలోవర్లు. ఇంతకీ విషయం ఏమిటంటే.. పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజంతో.. హసన్‌ అలీ ఏదో సీరియస్‌గా చర్చిస్తున్నట్లుగా ఉన్న ఫొటోను ఓ నెటిజన్‌ ట్విటర్‌లో షేర్‌ చేశాడు.

అతడి పెళ్లి గురించే!
ఈ ట్వీట్‌లో హసన్‌ అలీని ట్యాగ్‌ చేశాడు. ఇందుకు స్పందించిన అలీ.. ‘‘మేము షాదాబ్‌ పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాం’’ అంటూ ఇందులోకి షాదాబ్‌ ఖాన్‌ను లాగాడు. ఈ ట్వీట్‌కు బదులుగా షాదాబ్‌ తనదైన శైలిలో రిప్లై ఇచ్చాడు. ‘‘అసలు మీ ఇద్దరికీ ఏం అనిపిస్తోంది? నేను మరీ అంత పెద్దవాడిని అయిపోయాను అనుకుంటున్నారా?  

నేను చిన్న పిల్లాడిని
ప్రతి ఒక్కరు నా పెళ్లి గురించే అడుగుతున్నారు. నేనింకా చిన్న పిల్లాడినే’’ అని ఈ 24 ఏళ్ల ఆల్‌రౌండర్‌ సరదాగా బదులిచ్చాడు. కాగా నిలకడలేమి ఆట తీరు వల్ల 28 ఏళ్ల హసన్‌ అలీకి ఇటీవల జట్టులో అవకాశాలు కరువయ్యాయి. 

ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌ జట్టుకు అతడు ఎంపికకాలేదు. అదే విధంగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు సైతం సెలక్టర్లు అతడిని పరిగణనలోకి తీసుకోలేదు. మరోవైపు.. షాదాబ్‌ ఖాన్‌ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. ముఖ్యంగా.. టీ20 ఫార్మాట్‌లో ఈ ఆల్‌రౌండర్‌ అదరగొడుతున్నాడు.

ఆసియా కప్‌-2022, టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీల్లో అద్భుతంగా రాణించాడు. ఐసీసీ టోర్నీలో స్టార్‌ పేసర్‌ షాహిన్‌ ఆఫ్రిదితో కలిసి పాక్‌ తరఫున లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. ఈ లెగ్‌బ్రేక్‌ స్పిన్నర్‌ 11 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉంటే 28 ఏళ్ల హసన్‌ అలీ.. భారత్‌కు చెందిన సామియా ఆర్జూను పెళ్లాడిన విషయం తెలిసిందే. 

చదవండి: Hardik Pandya: వాళ్లిద్దరిని ఎందుకు ఆడించలేదు! ఇది నా జట్టు.. బయటి వాళ్ల మాటలు పట్టించుకోను!

మరిన్ని వార్తలు