WPL 2023: లేడీ సెహ్వాగ్‌ విధ్వంసం.. 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో! వీడియో వైరల్‌

5 Mar, 2023 17:29 IST|Sakshi

మహిళల ప్రీమియర్‌ లీగ్‌-2023 రెండో మ్యాచ్‌లో భారీ స్కోర్‌ నమోదైంది. బ్రబౌర్న్‌ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 223 పరుగులు సాధించింది. తద్వారా తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ చేసిన 210 పరుగుల అ‍త్యధిక స్కోర్‌ రికార్డును ఢిల్లీ బ్రేక్‌ చేసింది.

విధ్వంసం సృష్టించిన షఫాలీ వర్మ, లానింగ్‌
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీకు ఓపెనర్లు షఫాలీ వర్మ, లానింగ్‌ అదిరిపోయే శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 162 పరుగుల భారీ భాగస్వా‍మ్యం నెలకొల్పారు. ఇక ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచే  వీరిద్దరూ ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా షఫాలీ వర్మ అయితే బౌలర్లను ఊచ కోత కోసింది.

బౌండరీలతో ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడింది. ఈ మ్యాచ్‌లో 45 బంతులు ఎదుర్కొన్న షఫాలీ 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 84 పరుగులు చేసింది. ఇక లానింగ్‌ కూడా 43 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 72 పరుగులు చేసింది. అదే విధంగా ఆఖరిలో మారిజానే కాప్ కూడా బ్యాట్‌ ఝులిపించింది. కేవలం 17 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39 పరుగులు సాధించింది.
చదవండిడివిలియర్స్‌ వ్యక్తిగత రికార్డుల కోసం ఆడాడు.. అతడి కంటే రైనా చాలా బెటర్‌!

మరిన్ని వార్తలు