‘బిగ్‌బాష్‌’లో షఫాలీ, రాధ

14 May, 2021 04:39 IST|Sakshi
షఫాలీ వర్మ, రాధా యాదవ్‌

న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్‌ టీనేజ్‌ సెన్సేషన్‌ షఫాలీ వర్మకు మరో మంచి అవకాశం లభించింది. ఇంగ్లండ్‌లో జరిగే ‘హండ్రెడ్‌’లో బర్మింగ్‌హామ్‌ ఫోనిక్స్‌కు ఆడనున్న షఫాలీ... ఆస్ట్రేలియాలో జరిగే మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌ టి20 టోర్నమెంట్‌లో కూడా బరిలోకి దిగనుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. లీగ్‌లో ఆమె సిడ్నీ సిక్సర్స్‌ టీమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది.

ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం నంబర్‌వన్‌గా ఉన్న 17 ఏళ్ల షఫాలీ, భారత్‌ తరఫున 22 మ్యాచ్‌లలో 148.31 స్ట్రయిక్‌రేట్‌తో 617 పరుగులు చేసింది. మరో భారత క్రీడాకారిణి, 21 ఏళ్ల రాధా యాదవ్‌ కూడా బిగ్‌బాష్‌లో ఆడే అవకాశం ఉంది. ఈ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌తో కూడా సిడ్నీ సిక్సర్స్‌ టీమ్‌ చర్చలు తుది దశకు చేరాయని సమాచారం. బిగ్‌బాష్‌ లీగ్‌లో భారత్‌ నుంచి గతంలో హర్మన్‌ప్రీత్‌ (సిడ్నీ థండర్‌), స్మృతి మంధాన (బ్రిస్బేన్‌ హీట్స్‌), వేద కృష్ణమూర్తి (హోబర్ట్‌ హరికేన్స్‌) ప్రాతినిధ్యం వహించారు.

మరిన్ని వార్తలు