కమిన్స్‌కు షారుక్ ఖాన్‌‌ వార్నింగ్‌

23 Oct, 2020 16:12 IST|Sakshi

దుబాయ్‌ : కేకేఆర్‌ జట్టు సహ యజమాని.. బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ ఆసీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ పాట్‌ కమిన్స్‌కు వార్నింగ్‌ ఇచ్చాడు. అదేంటి షారుక్‌ కమిన్స్‌కు వార్నింగ్‌ ఇచ్చాడని  అనుకుంటున్నారా. వార్నింగ్‌ ఇచ్చిన మాట నిజమే కానీ.. సీరియస్‌ వార్నింగ్‌ కాదులేండి.. కేవలం సరదా కోసమే. అసలు విషయంలోకి వస్తే కేకేఆర్‌ జట్టుకు సంబంధించిన కొత్త పాటను వర్చువల్‌ సెషన్‌ ద్వారా కేకేఆర్‌ ఆటగాళ్లతో కలిసి షారుక్‌ లాంచ్‌ చేశాడు. ఈ వీడియో సెషన్‌లో కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌, దినేష్‌ కార్తీక్‌, పాట్‌ కమిన్స్‌ సహా మిగతా సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షారుక్‌ కేకేఆర్‌ ఆటగాళ్లతో సరదాగా ఇంటరాక్షన్‌ సెషన్‌ నిర్వహించాడు. ఈ క్రమంలో పాట్‌ కమిన్స్‌ న్యూ హెయిర్‌కట్‌పై షారుక్‌ సరదాగా టీజ్‌ చేశాడు. ఇదే సమయంలో కమిన్స్‌ కూడా పలు హిందీ పదాలు వాడుతూ షారుక్‌తో మాట్లాడాడు. కమిన్స్‌ ఈ కొత్త హెయిర్‌స్టైల్‌ ఏంటి అని షారుక్‌ అడగ్గా.. కేకేఆర్‌ అసిస్టెంట్‌ కోచ్‌ అభిషేక్‌ నాయర్‌ ఇలా కొత్త తరహా హెయిర్‌ స్టైల్‌ చేశాడని కమిన్స్‌ తెలిపాడు. (చదవండి : గంభీర్‌.. ఇప్పుడేమంటావ్‌?)

వెంటనే షారుక్‌ అందుకొని.. కమిన్స్‌ ఇంకెప్పుడు ఇలా చేయకు.కరోనా టైమ్‌లో ఇలాంటి ప్రయోగాలు అవసరమా అంటూ సరదాగా వార్నింగ్‌ ఇచ్చాడు. ' ఐపీఎల్‌ 2020 సీజన్‌ ప్రారంభమైన నుంచి న్యూ హెయిర్‌కట్‌ కోసం అభిషేక్‌ శర్మ వద్దకు నాలుగుసార్లు వెళ్లాలని.. ప్రతీసారి సరిగా కుదిరేది కాదు.. కానీ ఈసారి మాత్రం నా హెయిర్‌స్టైల్‌లో కొంచెం మార్పులు చోటుచేసుకున్నాయి. ఒక వేళ ఈసారి కూడా హెయిర్‌కట్‌ సరిగ్గా కుదరకపోయుంటే మొత్తం షేవ్‌ చేద్దామనుకున్నా 'అని కమిన్స్‌ తెలపగానే నవ్వులు విరిసాయి. కమిన్స్‌.. షారుక్‌కు మధ్య ఆసక్తికర చర్చ జరుగుతున్న సమయంలో దినేష్ కార్తీక్‌ కల్పించుకొని అభిషేక్‌ నాయర్‌ హెయిర్‌కట్‌ నైపుణ్యతను వివరించాకా కూడా కమిన్స్‌ అతని వద్దకే వెళ్లాడని పేర్కొన్నాడు. 

ఇక ఐపీఎల్‌ 13వ సీజన్‌లో కేకేఆర్‌ ప్రదర్శన నాసిరకంగా కనిపిస్తుంది. కెప్టెన్సీ చేతులు మారిన తర్వాతైనా విజయాలు సాధిస్తుందేమోనని భావించినా అలాంటిందేం జరలేదు. పైగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌లో విజయం దక్కించుకున్న కేకేఆర్‌ ఆ తర్వాత ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 20 ఓవరల్లో కేవలం 84 పరుగులు మాత్రమే చేసి ఘోర ఓటమి చవిచూసింది. 10 మ్యాచ్‌ల్లో 5విజయాలు.. 5 ఓటమిలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న కేకేఆర్‌ ప్లేఆఫ్‌కు చేరాలంటే ప్రతీ మ్యాచ్‌ నెగ్గాల్సిందే. దీంతో పాటు రన్‌రేట్‌ కూడా మెరుగుపరుచుకోవాల్సి ఉంది. కాగా కేకేఆర్‌ తన తర్వాతి మ్యాచ్‌లో పటిష్టమైన ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఎదుర్కోనుంది. (చదవండి : మొన్న ఏబీ‌.. ఈరోజు స్మిత్‌ను దించేశాడు)

>
మరిన్ని వార్తలు