Asia Cup 2022: భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్‌!

20 Aug, 2022 17:43 IST|Sakshi

ఆసియాకప్‌-2022కు పాకిస్తాన్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ పేసర్‌ షహీన్ షా అఫ్రిది గాయం కారణంగా ఆసియాకప్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం షహీన్ షా అఫ్రిది మోకాలి గాయం‍తో బాధపడతున్నాడు. ఈ ఏడాది జాలైలో శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో ఫీల్డింగ్‌ చేస్తుండగా అఫ్రిది గాయపడ్డాడు.

దీంతో అతడు శ్రీలంకతో అఖరి టెస్టుతో పాటు నెదార్లాండ్స్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. కాగా ప్రస్తుతం అతడు తన గాయం తీవ్రత దృష్ట్యా నాలుగు నుంచి ఆరు వారాల విశ్రాంతి తీసుకోవాలని పీసీబీ మెడికల్ అడ్వైజరీ కమిటీ సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు ఆసియాకప్‌తో పాటు వచ్చే నెల స్వదేశంలో జరగనున్న ఇంగ్లండ్‌ సిరీస్‌కు కూడా దూరంకానున్నాడు.

ఇక అతడు తిరిగి మళ్లీ న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, బం‍గ్లాదేశ్‌తో ట్రై సిరీస్‌కు తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా ఆసియాకప్‌-2022 ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానుంది. పాకిస్తాన్‌ తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 28న దుబాయ్‌ వేదికగా భారత్‌తో తలపడనుంది. 
ఆసియా కప్‌కు పాక్‌ జట్టు
బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, షాహనావాజ్ ఆఫ్రిది దహానీ  ఉస్మాన్ ఖదీర్
చదవండి: యూఏఈ టీ20 లీగ్‌లో అజం ఖాన్‌.. తొలి పాక్‌ ఆటగాడిగా!

మరిన్ని వార్తలు