ఆ క్రికెటర్‌తోనే నా కూతురు పెళ్లి: పాక్‌ మాజీ క్రికెటర్‌

23 May, 2021 15:38 IST|Sakshi

కరాచీ: పాకిస్తాన్‌ మాజీ ఆటగాడు షాహిద్‌ అఫ్రిది ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. గత మార్చిలో పాక్‌ యంగ్‌ క్రికెటర్‌ షాహిన్‌ అఫ్రిదికి.. షాహిద్‌ అఫ్రిది పెద్ద కూతురు అక్సా అఫ్రిదికి షాదీ జరగనుందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. షాహిన్‌ అఫ్రిది తండ్రి అయాజ్‌ ఖాన్‌ అక్సా ఇంటికి వెళ్లి మాట్లాడాడని.. ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి ఒప్పుకున్నాయంటూ పలు పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. అయితే వీటిపై షాహిద్‌ అఫ్రిది మాత్రం ఏనాడు స్పందించలేదు. కానీ తాజాగా షాహిద్‌ అఫ్రిది తన కూతురు పెళ్లిపై తొలిసారి స్పందించాడు.


''నా కూతురు పెళ్లి త్వరలోనే షాహిన్‌ అఫ్రిదితో జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఇరు కుటుంబాలు చర్చించుకున్నాం. కానీ ఈ ప్రొపోజల్‌కు ముందు నా కూతురు అక్సా, షాహిన్‌లు రిలేషన్‌ ఉన్నారన్నది అబద్దం. ఇది పెద్దల అంగీకారంతో జరుగుతున్న పెళ్లి. షాహిన్‌ తండ్రి నా కూతురు తన కోడలు కావాలని ఇంటికి వచ్చి అడగడంతో కాదనలేకపోయా. అయితే నా కూతురు అక్సా డాక్టర్‌ చదువుతుంది.. త్వరలోనే విదేశాలకు వెళ్లాలనుకుంటుంది. షాహిన్‌ కూడా తన కెరీర్‌పై దృష్టి పెట్టాడు. కాబట్టి ఇద్దరు తమ కెరీర్‌లో స్థిరపడ్డాకే నిఖా అనుకుంటున్నాం.. ఇప్పటికే ఇరు కుటుంబాలు దీనికి అంగీకరించడం జరిగిపోయింది. ఇంతకాలం వచ్చిన రూమర్లకు ఇక చెక్‌ పెట్టండి.'' అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా షాహిన్‌ అఫ్రిది ఇప్పుడిప్పుడే పాకిస్తాన్‌కు కీలక బౌలర్‌గా ఎదుగుతున్నాడు. షాహిన్‌ అఫ్రిది ఇప్పటివరకు పాకిస్తాన్‌ తరపున 17 టెస్టుల్లో 58 వికెట్లు.. 25 వన్డేల్లో 51 వికెట్లు.. 25 టీ20ల్లో 27 వికెట్లు తీశాడు. కరోనాతో వాయిదా పడ్డ పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ 6వ సీజన్‌లో అఫ్రిదీతో కలిసి షహీన్‌ ఆడాడు. షాహీన్‌ లాహోర్‌ క్యూలాండర్స్‌కు.. షాహిద్‌ ముల్తాన్‌ సుల్తాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 
చదవండి: అఫ్రిది కూతురితో షాహిన్‌ అఫ్రిది నిశ్చితార్థం!

'మామా.. ఇప్పటికైనా మీ పంతం వదిలేయండి'

మరిన్ని వార్తలు