ఘనంగా షాహిద్‌ ఆఫ్రిది కుమార్తె వివాహం.. హాజరైన షాహిన్‌ ఆఫ్రిది

31 Dec, 2022 10:50 IST|Sakshi
వివాహ వేడుకలో షాహిద్‌ ఆఫ్రిదితో షాహిన్‌ ఆఫ్రిది (PC: Twitter)

Shahid Afridi Daughter Marriage: పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, చీఫ్‌ సెలక్టర్‌ షాహిద్‌ ఆఫ్రిది ఇంట పెళ్లి సందడి నెలకొంది. అతడి పెద్ద కుమార్తె అక్సాకు నసీర్‌ నాసిర్‌ అనే వ్యక్తితో వివాహం జరిగింది. కరాచీలో శుక్రవారం అత్యంత సన్నిహితుల నడుమ నిఖా జరిగింది.

ఇక ఈ పెళ్లిలో పాకిస్తాన్‌ స్టార్‌ పేసర్‌ షాహిన్‌ షా ఆఫ్రిది ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. కాబోయే మామ షాహిద్‌తో కలిసి తోడల్లుడి వెనుకాల నిల్చుని వేడుకను వీక్షించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

షాహిన్‌ వివాహం ఎప్పుడంటే!
షాహిద్‌ ఆఫ్రిది రెండో కుమార్తె అన్షా ఆఫ్రిదితో షాహిన్‌ పెళ్లి జరుగనున్న విషయం తెలిసిందే. కాగా పెద్ద కూతురు అక్సా వివామైన తర్వాత అన్షాకు పెళ్లి చేయాలని షాహిద్‌ కుటుంబం నిర్ణయించింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 3న షాహిన్‌- అన్షా పెళ్లికి ముహూర్తం ఖరారు చేసింది.

వాళ్లు అడిగారు.. ఓకే అన్నా
కాగా తన కుమార్తెతో షాహిన్‌ నిఖా జరిపించే విషయమై అతడి కుటుంబం తమను సంప్రదించిందని షాహిద్‌ గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా పాక్‌ ప్రధాన పేసర్‌గా షాహిన్‌ ఎదగగా.. షాహిద్‌ ఇటీవలే పీసీబీ చీఫ్‌ సెలక్టర్‌గా ఎన్నికయ్యాడు. ఇలా మామా- అల్లుడు పాకిస్తాన్‌ క్రికెట్‌లో కీలక సభ్యులుగా మారారు. ఇదిలా ఉంటే షాహిద్‌ ఆఫ్రిదికి ఐదుగురు ఆడపిల్లలు సంతానం అన్న విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం అతడికి ఐదోసారి ఆడబిడ్డ జన్మించింది.


కూతుళ్లతో షాహిద్‌ ఆఫ్రిది

చదవండి: Pele: అటకెక్కిన అంతర్యుద్దం.. అట్లుంటది పీలేతోని! కానీ.. ఎంత ఎదిగినా... ఆయనకూ తప్పలేదు!
Rishabh Pant: తల్లిని సర్‌ప్రైజ్‌ చేద్దామనుకుని ఇలా!.. త్వరగా కోలుకో.. కోహ్లి ట్వీట్‌

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు