గాలె గ్లాడియేటర్స్‌  కెప్టెన్‌గా అఫ్రిది 

23 Nov, 2020 04:59 IST|Sakshi

సర్ఫరాజ్‌ అహ్మద్‌ స్థానంలో సారథ్య బాధ్యతలు  

కరాచీ : లంక ప్రీమియర్‌ లీగ్‌ (ఎల్‌పీఎల్‌)లో ‘గాలె గ్లాడియేటర్స్‌’ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్, ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది ఎంపికయ్యాడు. ఈనెల 26 నుంచి డిసెంబర్‌ 16 వరకు టి20 ఫార్మాట్‌లో జరుగనున్న ఈ టోర్నీలో... సర్ఫరాజ్‌ అహ్మద్‌ స్థానాన్ని అఫ్రిది భర్తీ చేయనున్నాడు. తొలుత గాలె గ్లాడియేటర్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వికెట్‌ కీపర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ నియమితుడయ్యాడు. అయితే న్యూజిలాండ్‌ పర్యటనకు ఎంపిక చేసిన పాకిస్తాన్‌ జాతీయ జట్టులోకి సర్ఫరాజ్‌కు పిలుపు రావడంతో అతని స్థానంలో అఫ్రిది సారథ్య బాధ్యతలు స్వీకరించాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ యజమాని, పాకిస్తాన్‌ పారిశ్రామికవేత్త నదీమ్‌ ఒమర్‌ స్పష్టం చేశారు. తొలిసారిగా జరుగనున్న ఈ టోర్నీలో జాఫ్నా స్టాలియన్స్, క్యాండీ టస్కర్స్, గాలె గ్లాడియేటర్స్, కొలంబో కింగ్స్, దంబుల్లా హాక్స్‌ జట్లు టైటిల్‌ కోసం తలపడనున్నాయి.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు