Shahid Afridi: 'కోహ్లి రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయం'.. మండిపడ్డ టీమిండియా ఫ్యాన్స్‌

13 Sep, 2022 18:42 IST|Sakshi

టీమిండియా రన్‌మెషిన్‌ విరాట్‌ కోహ్లి ఇటీవలే ముగిసిన ఆసియా కప్‌లో భారత్‌ తరపున టాప్‌ స్కోరర్‌. ఒక సెంచరీ, రెండు అర్థసెంచరీల సాయంతో 274 పరుగులు సాధించాడు. అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో 71వ శతకం సాధించిన కోహ్లి తిరిగి పూర్తిస్థాయి ఫామ్‌లోకి వచ్చినట్లు అనిపిస్తుంది. రాబోయే టి20 ప్రపంచకప్‌కు ముందు కోహ్లి ఫామ్‌లోకి రావడం టీమిండియా ఫ్యాన్స్‌ను ఉత్సాహపరుస్తోంది.

గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా ఉన్న కోహ్లికి..  ఈ ఏడాది మాత్రం కెప్టెన్సీ భారం లేకపోవడం ఒక రకంగా మంచిదే. ఈసారి పొట్టి ప్రపంచకప్‌లో కోహ్లి కచ్చితంగా రాణిస్తాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే  పాకిస్తాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది కోహ్లి రిటైర్మెంట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  కెరీర్‌లో పీక్‌ స్టేజీలో ఉన్నప్పుడే ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటిస్తే గౌరవంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. 

''ఫేలవ ఫామ్‌తో ఆటకు రిటైర్‌ ఇస్తే ఎవరు గుర్తించరు. అలా కాకుండా కెరీర్‌లో పీక్‌ స్టేజీలో ఉన్నప్పుడే రిటైర్మెంట్‌ ఇస్తే దానికి గౌరవం ఉంటుంది. ఇలా కొంతమంది ఆటగాళ్లు మాత్రమే చేస్తారు. అందులో కోహ్లి కూడా ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. అందునా ఆసియా ఖండం నుంచి ఆడుతున్న క్రికెటర్లు ఇలాంటి నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటారు. కోహ్లి కూడా కెరీర్‌ను ఎంత అద్భుతంగా ఆరంభించాడో.. అంతే అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పుడే వైదొలుగుతాడని అనుకుంటున్నా'' అంటూ తెలిపాడు.

కాగా షాహిద్‌ అఫ్రిది వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ''అఫ్రిదికి మైండ్‌ దొబ్బింది.. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు..  ''కెరీర్‌లో పీక్‌ స్టేజీలో ఉన్నప్పుడు ఎవరైనా రిటైర్‌ అవ్వాలనుకుంటారా''.. అంటూ కామెంట్స్‌ చేశారు.

చదవండి: 'ధోని రికార్డులను రోమన్‌ రెయిన్స్‌ బద్దలు కొట్టగలడు'

టి20 ప్రపంచకప్‌కు కొత్త జెర్సీతో బరిలోకి టీమిండియా..

మరిన్ని వార్తలు