'అతడిని టీ20 ప్రపంచకప్‌కు ఎంపికచేయాల్సింది.. బాబర్‌కు సపోర్ట్‌గా ఉండేవాడు'

16 Sep, 2022 18:27 IST|Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022కు పాకిస్తాన్‌ జట్టును పీసీబీ గురువారం ప్రకటించింది. గాయం కారణంగా ఆసియాకప్‌కు దూరమైన పేసర్‌ షాహిన్‌ షా ఆఫ్రిదితో పాటు బ్యాటర్లు షాన్‌ మసూద్‌, హైదర్‌ అలీ తిరిగి జట్టులోకి వచ్చారు. అయితే మరో సారి వెటరన్‌ ఆటగాడు షోయబ్‌ మాలిక్‌కు సెలక్టర్లు మొండి చేయి చూపించారు.  ఈ ఐసీసీ మెగా ఈవెంట్‌కు మాలిక్‌ను ఎంపిక చేయకపోవడాన్ని పాక్‌ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది తప్పుబట్టాడు.

మాలిక్‌ వంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు టీ20 ప్రపంచకప్‌ జట్టులో ఉండాల్సిందని అఫ్రిది అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో సమా టీవీతో అఫ్రిది మాట్లాడుతూ.. "మాలిక్‌కు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ ఆడిన అనుభవం ఉంది. అదే విధంగా అతడు ఆడిన ప్రతీ చోట అద్భుతంగా రాణించాడు. మాలిక్‌ 40 ఏళ్ల వయస్సులోనూ ఫిట్‌గా ఉన్నాడు.

అతడికి మిడిలార్డర్‌లో తన బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను మార్చగల సత్తా ఉంది. మాలిక్‌ను టీ20 ప్రపంచకప్‌కు ఎంపికచేయాల్సింది. మాలిక్‌ జట్టులో ఉండి ఉంటే.. కెప్టెన్‌ బాబర్‌ ఆజాంకు కూడా అతడి నుంచి ఫీల్డ్‌లో సపోర్ట్‌ ఉండేది"పేర్కొన్నాడు. కాగా గత కొంత కాలంగా జాతీయ జట్టుకు మాలిక్‌ను సెలెక్టర్లు ఎంపికచేయడం లేదు. అతడు చివరి సారిగా పాక్‌ తరపున గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ఆడాడు.
చదవండి: T20 WC: షాహిన్‌ విషయంలో ఆఫ్రిది చెప్పింది నిజమే అయితే అంతకంటే దారుణం మరొకటి ఉండదు! అతడు..

మరిన్ని వార్తలు