బంగ్లాదేశ్‌ కెప్టెన్‌కు చేదు అనుభవం.. కాలర్ పట్టి లాగి! వీడియో వైరల్‌

17 Mar, 2023 13:38 IST|Sakshi

బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌, టీ20 కెప్టెన్‌ షకీబ్ అల్ హసన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ జువెలరీ షాపు ఓపెనింగ్ కోసం దుబాయ్ వెళ్లిన షకీబ్‌ను అభిమానులు చుట్టుముట్టారు. అతడిని కొంచెం కూడా ​ముందుకు కదలనివ్వలేదు. తమ ఆరాధ్య క్రికెటర్‌తో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలో కొంత మంది అతన్ని కాలర్ పట్టి లాగారు.

అయితే తనను తాను బ్యాలెన్స్ చేసుకుని షకీబ్‌ కింద పడకుండా ముందుకు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే షకీబ్‌ వంటి స్టార్‌ క్రికెటర్‌ షాపు ఓపెనింగ్‌కు వచ్చినప్పుడు.. నిర్వహకులు ఎటువంటి భద్రత కల్పించకపోవడం అందరని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

అదే విధంగా​ చిన్న చిన్న విషయాలపై అభిమానులపై కోపంతో ఊగిపోయే షకీబ్‌.. ఇంత జరిగినా అభిమానులపై కొంచెం సీరియస్‌ కాకపోవడం గమానార్హం. ఇక​ ఇది ఇది ఇలా ఉండగా.. అతడి సారథ్యంలోని బంగ్లాదేశ్‌ జట్టు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. ఈ సిరీస్‌ ముగిసిన అనంతరం షకీబ్‌ దుబాయ్‌ టూర్‌కు వెళ్లాడు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది.
చదవండిIPL 2023: ఆర్సీబీలోకి విధ్వంసకర ఆల్‌రౌండర్‌.. ఇక ప్రత్యర్ది బౌలర్లకు చుక్కలే

మరిన్ని వార్తలు