Shakib Al Hasan: మరోసారి బంగ్లాదేశ్‌ టెస్టు కెప్టెన్‌గా షకీబ్‌ అల్‌ హసన్‌!

2 Jun, 2022 17:41 IST|Sakshi

Bangladesh New Test Captain: వెటరన్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ బంగ్లాదేశ్‌ టెస్టు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. అతడికి డిప్యూటీగా లిటన్‌ దాస్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది. కాగా ఇటీవల స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఓటమికి బాధ్యత వహిస్తూ మొమినల్‌ హక్‌ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షకీబ్‌ మరోసారి బంగ్లాదేశ్‌ టెస్టు పగ్గాలు చేపట్టాడు. 

కాగా 2019లో కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ ఆల్‌రౌండర్‌పై ఐసీసీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఓ ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌కు ముందు బుకీలు అతడిని సంప్రదించినా ఆ విషయాన్ని అతడు దాచిపెట్టాడు. అవినీతి నిరోధక భద్రత విభాగానికి, బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు దృష్టికి తీసుకెళ్లలేదు. దీంతో అతడిపై రెండేళ్ల పాటు వేటు పడింది. కాగా గతంలో షకీబ్‌ రెండుసార్లు బంగ్లా టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2009లొ వెస్టిండీస్‌ పర్యటనలో మొర్తజా గాయపడగా.. షకీబ్‌ అల్‌ హసన్‌ కెప్టెన్సీ చేశాడు. 

ఆ తర్వాత 2017లో సారథిగా ముష్ఫికర్‌ రహీమ్‌ స్థానాన్ని భర్తీ చేశాడు. ఇక మొమినల్‌ సారథ్యంలో బంగ్లాదేశ్‌ మూడు టెస్టుల్లో మూడు విజయాలు సాధించగా.. రెండింటిని డ్రా చేసుకుంది. ఏకంగా 12 మ్యాచ్‌లలో పరాజయం చవిచూసింది. కాగా కెప్టెన్సీ భారాన్ని దించుకున్న మొమినల్‌ ఇకపై బ్యాటింగ్‌పై దృష్టి సారిస్తానని పేర్కొన్నాడు. 

చదవండి 👇
Eng Vs NZ 1st Test: మాథ్యూ పాట్స్‌ అరంగేట్రం.. ఇంగ్లండ్‌ తరఫున 704వ ఆటగాడిగా!
IPL 2023: ఏడు కోట్లా! అంత సీన్‌ లేదు! సిరాజ్‌ను వదిలేస్తే.. చీప్‌గానే కొనుక్కోవచ్చు!

మరిన్ని వార్తలు