IND vs BAN: భారత్‌తో వన్డే సిరీస్‌.. బంగ్లాదేశ్‌ జట్టు ప్రకటన! స్టార్‌ ఆల్‌రౌండర్‌ వచ్చేశాడు

25 Nov, 2022 08:25 IST|Sakshi

స్వదేశంలో భారత్‌తో వన్డే సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు వెటరన్‌ ఆటగాడు తమీమ్‌ ఇక్బాల్ సారథ్యం వహించనున్నాడు. అదే విధంగా యువ పేసర్ షోరిఫుల్ ఇస్లాంతో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ మొసద్దెక్ హొస్సేన్‌పై సెలక్టర్లు వేటు వేశారు.

గత మరోవైపు జింబాబ్వేతో వైట్‌ బాల్‌ సిరీస్‌కు దూరమైన షకీబ్‌ ఆల్‌ హసన్‌ తిరిగి భారత్‌ సిరీస్‌తో జట్టులోకి వచ్చాడు. ఇక హోం సిరీస్‌లో భాగంగా బంగ్లా జట్టు టీమిండియా మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. డిసెంబర్ 4న ఢాకా వేదికగా జరగనున్న తొలి వన్డేతో భారత పర్యటన ప్రారంభం కానుంది.

భారత్‌తో వన్డేలకు బంగ్లా జట్టు: తమీమ్ ఇక్బాల్ (కెప్టెన్), లిట్టన్ కుమార్ దాస్, అనముల్ హక్ బిజోయ్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హొస్సేన్, యాసిర్ అలీ చౌదరి, మెహిదీ హసన్ మిరాజ్, ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్ అహ్మద్, హసన్ మహ్మద్, ఎబాడోత్ హుస్సేన్, నసుమ్ అహ్మద్,జ్ముల్ హుస్సేన్ శాంటో,మహ్మదుల్లా,నూరుల్ హసన్ సోహన్‌
చదవండి: IND vs NZ 1st ODI:తొలుత బ్యాటింగ్‌ చేయనున్న భారత్‌.. యువ బౌలర్లు ఎంట్రీ! సంజూకి ఛాన్స్‌

మరిన్ని వార్తలు