పాకిస్తాన్‌తో సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్‌కు బిగ్‌ షాక్‌...

6 Nov, 2021 17:53 IST|Sakshi

Shakib Al Hasan set to miss Pakistan T20Is due to hamstring injury:  పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్ అల్ హసన్ గాయం కారణంగా పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. టీ20 ప్రపంచకప్‌-2021 ముగిసిన తర్వాత  మూడు టీ20లు, రెండు టెస్ట్ మ్యాచ్‌ల కోసం  పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది.

నవంబర్‌19న మీర్పూర్‌ వేదికగా తొలి టీ20 మ్యాచ్‌ ప్రారంభంకానుంది. కాగా మెకాలి గాయం కారణంగా  టీ20 ప్రపంచకప్‌ మద్య నుంచి షకీబ్ అల్ హసన్ తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ మెగా టోర్నమెంట్‌లో బంగ్లాదేశ్‌ పేలవ ప్రదర్శన కనబరించింది. రెండు సార్లు 100 పరుగుల లోపు ఆలౌటై  ఘోర పరాభావాన్ని  మూటకట్టుకుంది. 

చదవండి: Jasprit Bumrah: టీ20ల్లో అరుదైన రికార్డు సాధించిన బుమ్రా...

మరిన్ని వార్తలు