షకీబ్‌ మాయాజాలం

21 Jan, 2021 05:19 IST|Sakshi

4 వికెట్లతో చెలరేగిన స్టార్‌ ఆల్‌రౌండర్‌

వెస్టిండీస్‌పై 6 వికెట్లతో బంగ్లాదేశ్‌ ఘనవిజయం  

ఢాకా: వెస్టిండీస్‌తో ప్రారంభమైన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబుల్‌ హసన్‌ (4/8) విజృంభించాడు. దాంతో తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 6 వికెట్లతో ఘనవిజయం సాధించింది. ముందుగా వెస్టిండీస్‌ 32.2 ఓవర్లలో 122 పరుగులకే  కుప్పకూలింది. కెల్‌ మయేర్స్‌ (40; 4 ఫోర్లు, 1 సిక్స్‌), పావెల్‌ (31 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా మిగతా వారు పరుగులు సాధించలేకపోయారు. షకీబ్‌తో పాటు హసన్‌ మహముద్‌ 3, ముస్తఫిజుర్‌ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బంగ్లాదేశ్‌ 33.5 ఓవర్లలో 4 వికెట్లకు 125 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్‌ తమీమ్‌ ఇక్బాల్‌ (69 బంతుల్లో 44; 7 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. షకీబ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పురస్కారం దక్కింది. ఈ మ్యాచ్‌తో వెస్టిండీస్‌ తరఫున ఆరుగురు ప్లేయర్లు, బంగ్లా జట్టులో ఒకరు అంతర్జాతీయ అరంగేట్రం చేశారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు