BAN Vs SL 2022: శ్రీలంకతో తొలి టెస్ట్‌.. బంగ్లాదేశ్‌కు గుడ్‌ న్యూస్‌..!

13 May, 2022 16:51 IST|Sakshi

శ్రీలంకతో తొలి టెస్టుకు ముందు బంగ్లాదేశ్‌ ఊరట లభించింది. కరోనా బారిన పడిన ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌  షకీబ్‌ అల్‌ హసన్‌ కరోనా నుంచి కోలుకున్నాడు. దీంతో మే 15న ఛటోగ్రామ్‌ వేదికగా జరగనున్న తొలి టెస్టుకు షకీబ్‌ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. మే9 న అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత షకీబ్ కరోనా బారిన పడ్డాడు.

దీంతో అతడు ఐషోలేషన్‌లో ఉన్నాడు. అయితే అతడికి తాజాగా నిర్వహించిన పరీక్షలలో నెగిటివ్‌గా తేలింది. ఇక షకీబ్‌ చివర సారిగా 2021లో పాకిస్తాన్‌పై ఆడాడు. న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా సిరీస్‌లకు వ్యక్తిగత కారణాలతో షకీబ్ దూరమయ్యాడు. ఇక స్వదేశంలో బంగ్లాదేశ్‌ శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడనుంది. తొలి టెస్టు ఛటోగ్రామ్‌ వేదికగా మే 15 నుంచి ప్రారంభం కానుంది.

బంగ్లాదేశ్‌ జట్టు:  మోమినుల్ హక్ (కెప్టెన్), తమీమ్ ఇక్బాల్ ఖాన్, మహ్మదుల్ హసన్ జాయ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ కుమార్ దాస్, యాసిర్ అలీ చౌదరి, తైజుల్ ఇస్లాం, మెహెదీ హసన్ మిరాజ్, ఎబాడోత్ హుస్సేన్ చౌద్యుల్, ఎబాడోత్ హుస్సేన్ చౌదుల్, హసన్ సోహన్, రెజౌర్ రెహమాన్ రాజా, షోహిదుల్ ఇస్లాం, షోరిఫుల్ ఇస్లాం

చదవండి: Ben Stokes: వైరల్‌గా మారిన ఇంగ్లండ్‌ కొత్త కెప్టెన్‌ చర్య

మరిన్ని వార్తలు