Symonds-Shane Warne: 'వార్న్‌.. సాక్సుల్లో నోట్ల కట్టలు దాచేవాడు'

30 Mar, 2022 19:43 IST|Sakshi

ఆస్ట్రేలియా స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ భౌతికంగా దూరమై నెలరోజులు కావొస్తుంది. బుధవారం మెల్‌బోర్న్‌ వేదికగా వార్న్‌ అంత్యక్రియలను ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారిక లాంచనాలతో నిర్వహించనుంది. మరికొద్ది గంటల్లో వార్న్‌ అంత్యక్రియలు ముగియనున్నాయి. ఇప్పటికే ఆసీస్‌ ప్రస్తుత, మాజీ క్రికెటర్లు సహా చాలా మంది క్రికెట్‌ అభిమానులు వార్న్‌కు కడసారి వీడ్కోలు పలికేందుకు మెల్‌బోర్న్‌కు పోటెత్తుతున్నారు. 

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ సైమండ్స్‌.. దిగ్గజ స్పిన్నర్‌తో ఉన్న జ్ఞాపకాలను పంచకున్నాడు. ''కొన్నేళ్ల పాటు డ్రెస్సింగ్‌రూమ్‌లో మా ఇద్దరి మధ్య చాలా సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఒక విషయం మాత్రం ఎప్పటికి మరిచిపోను. సౌతాఫ్రికాతో బాక్సింగ్‌ టెస్టు అనుకుంటా.. ఆ మ్యాచ్‌ మూడోరోజు ఆట ప్రారంభమైంది. ఆ సందర్భంలో ఒక పని విషయమై వార్న్‌ దగ్గరికి వెళ్లాను.

అయితే అప్పటికే వార్న్‌ తన హెల్మెట్‌ పక్కన సాక్సులను గది మొత్తం పరిచాడు. ఆ సాక్సుల్లో వంద ఆస్ట్రేలియన్‌ డాలర్ల నోట్ల కట్టలు ఉండలుగా చుట్టు ఉన్నాయి. ఇదంతా చూసి ఏంటిదంతా.. డబ్బు అంతా ఎక్కడిది అని అడిగాను. రాత్రి కాసినో ఆడాను. ఆ గేమ్‌లో ఈ డబ్బును సొంతం చేసుకున్నాను. . దాదాపు 40 నోట్ల కట్టలు ఉంటాయి.. లెక్కపెట్టడానికి ఒకరోజు పడుతుంది. డబ్బు కింగ్‌ అన్నది ఇది చూస్తే నీకు అర్థమవుతుంది కదా బ్రదర్‌ అంటూ చెప్పుకొచ్చాడు. నిజానికి వార్న్‌ దగ్గర సాక్స్‌, బూట్లు చాలా ఉండేవి. మేం ఏం పర్యటనకు వెళ్లినా వార్న్‌ తన వెంట చాలా జతల సాక్స్‌లు, బూట్లు పట్టుకొచ్చేవాడు.'' అని సైమండ్స్‌ పేర్కొన్నాడు.

చదవండి: ODI Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో పాక్‌ను వెనక్కునెట్టి ఆరో స్థానానికి చేరుకున్న బంగ్లాదేశ్‌ 

ICC Rankings: టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో ఆసీస్‌ ప్లేయర్ల హవా.. దిగజారిన కోహ్లి, రోహిత్‌ ర్యాంక్‌లు

మరిన్ని వార్తలు