Ashwin Vs Morgan: మోర్గాన్‌ తప్పు లేదు.. అశ్విన్‌ను అడ్డుకునే హక్కు ఉంది

29 Sep, 2021 17:24 IST|Sakshi

Ravichandran Ashwin- Eoin Morgan Controversy.. ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌, కేకేఆర్‌ మధ్య మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో విజయం ఎవరు సాధించారనే దానికంటే అశ్విన్‌- మోర్గాన్‌ గొడవ ఎక్కువ ప్రాధాన్యం సంతరించుకుంది. సౌథీ బౌలింగ్‌లో ఔటై వెళ్తున్న అశ్విన్‌పై సౌథీ నోరు జారగా.. అతనికి కెప్టెన్‌ మోర్గాన్‌ మద్దతుగా నిలిచాడు. ఇది నచ్చని అశ్విన్‌ మోర్గాన్‌కు కోపంగా బ్యాట్‌ను చూపిస్తూ అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అశ్విన్‌ తన బౌలింగ్‌లోనే మోర్గాన్‌ను డకౌట్‌ చేయడం ద్వారా గట్టిగా అరుస్తూ పెవిలియన్‌ వెళ్లు అంటూ బదులు తీర్చుకున్నాడు. వీరి వివాదం సోషల్‌ మీడియాలో ఆసక్తికరంగా మారింది. అంతకముందు రిషబ్‌- అశ్విన్‌ జోడి ఒక పరుగు అదనంగా తీయడమే ఈ గొడవకు మూల కారణం. కాగా దీనిపై పలువురు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చదవండి: Ashwin Vs Morgan: మోర్గాన్‌ అనవసరంగా గెలికాడు.. తన పవరేంటో చూపించాడు

తాజాగా ఆసీస్‌ దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ అశ్విన్‌- మోర్గాన్‌ వివాదంపై స్పందించాడు. క్రికెట్‌లో ఇలాంటివి జరగడం సాధారణం. దీనిపై రెండుగా చీలిపోయి చర్చ పెట్టడం కూడా వ్యర్థమే. నిన్న జరిగిన గొడవలో నా దృష్టిలో అశ్విన్‌దే తప్పు. ఒక పరుగు అదనంగా తీయడం పెద్ద  నేరం కాకపోవచ్చు.. కానీ ఒక బౌలర్‌ ఆ విషయాన్ని గుర్తు చేస్తూ వ్యాఖ్యలు చేస్తే.. అతనికి ధీటుగా బదులివ్వడం వరకు ఓకే. కానీ గొడవను ఆపుదామని వచ్చిన మోర్గాన్‌పై కోపం వ్యక్తం చేయడం ఏం బాలేదు. తన బౌలింగ్‌లో మోర్గాన్‌ డకౌట్‌ అయి వెళ్లేటప్పుడు గట్టిగా అరుస్తూ ఆవేశాన్ని వ్యక్తం చేసి తన గౌరవాన్ని కించపరుచుకున్నాడు. ముమ్మాటికి మోర్గాన్‌కు అశ్విన్‌ను అడ్డుకునే హక్కు ఉంది. అని చెప్పుకొచ్చాడు. 

ఇక ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్‌దిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. అనంతరం 128 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన కేకేఆర్‌ 18.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. 

చదవండి: IPL 2021: డెబ్యూ మ్యాచ్‌లోనే గొడవ.. మోర్గాన్‌ మద్దతు

>
మరిన్ని వార్తలు