టీ20లో టాప్‌ 5 బౌలర్లు వీళ్లే !

7 Oct, 2020 11:34 IST|Sakshi

ఫేవరెట్‌ బౌలర్ల జాబితాను ప్రకటించిన వాట్సన్‌

ఢిల్లీ: షేన్‌ వాట్సన్‌.. క్రికెట్‌ ప్రపంచంలో ఒక్క గొప్ప ఆల్‌రౌండర్‌. ప్రత్యర్థి బౌలర్‌ ఎవరైనా తన బ్యాట్‌తో విజృంభించగల ఆటగాడు. బ్యాటింగ్‌లోనే కాదు బౌలింగ్‌లోనూ తన సత్తా చూపగలడు. 2016లో అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌కు గుడ్‌బై చెప్పినా, ఫ్రాంచైజీల్లో ఇంకా తన ఆటను కొనసాగిస్తున్నాడు. ఐపిఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరుపున కీలక ఆటగాడిగా ఉన్నాడు. ఇప్పటికీ ప్రత్యర్థి జట్లకు తను ఒక టార్గెట్‌ బ్యాట్స్‌మెన్‌. తన కెరీర్‌లో ఎంతో మంది మేటి బౌలర్ల్‌ను ఎదుర్కున్నాడు. అలాంటి బ్యాట్స్‌మెన్‌కు టీ20లో టాప్‌ 5 బౌలర్లు ఎవరో తెలుసా...

వాట్సన్‌ తన టాప్‌-5 టీ20 బౌలర్ల జాబితాలో లసిత్‌ మలింగ​ మొదటి స్థానంలో ఉన్నాడు. టీ20లో అతడు అత్యుత్తమ బౌలర్‌ అని వాట్సన్‌ అన్నాడు. మలింగ వేసే 'యార్కర్స్‌' ఏ బౌలర్‌ వేయలేడని, భవిష్యత్తులో కూడా అలాంటి బౌలర్‌ను చూడకపోవచ్చని కితాబిచ్చాడు. 


ఇక రెండో బౌలర్‌ షాహిద్‌ అఫ్రిది పేరు చెప్పాడు. షాహిద్‌ ఒక విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌ అయినా, టీ20లో అతడు మంచి బౌలర్‌ అని పేర్కొన్నాడు. వికెట్లు తీయడకమే కాకుండా పరుగులు ఇవ్వకుండా కట్టడిచేయగల సత్తా ఉన్న బౌలర్‌ అని అన్నాడు. ప్రతి జట్టులో అలాంటి ఒక బౌలర్‌ ఉండాలని కోరు​కుంటారని తెలిపాడు. 


ఇక మూడో స్థానంలో జస్ప్రిత్‌ బుమ్రా పేరు చెప్పాడు. ప్రస్తుత కాలంలో అతడు అత్యుత్తమ బౌలర్‌ అని, అద్భుతమైన యార్కర్స్‌ వేస్తాడని తెలిపాడు. బంతి వేగంతో పాటు స్వింగ్‌ చేయగల సామర్థ్యం ఉన్న బౌలరని...అతడి బౌలింగ్‌లో ఆడడం 'ఛాలెంజింగ్‌'గా ఉంటుందని పేర్కొన్నారు. 


ఇక నాలుగు, ఐదు స్థానాల్లో వెస్టిండీస్‌ ఆటగాళ్లు డ్వైన్‌ బ్రావో, సునిల్‌ నరైన్‌ పేర్లను తెలిపాడు.

(ఇదీ చదవండి: ఆ క్రెడిట్‌ అంతా వారిదే: డుప్లెసిస్‌)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు