WTC 2021-23: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే రెండు జట్లు ఇవే: షేన్ వాట్సన్‌

20 Aug, 2022 16:06 IST|Sakshi

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(2021-23)లో ఫైనల్‌కు చేరే జట్లను ఆస్ట్రేలియా మాజీ ఆల్‌  రౌండర్ షేన్ వాట్సన్‌ అంచనా వేశాడు. ప్రస్తుత టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్లో ఆసీస్‌, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి అని  వాట్సన్‌ జోస్యం చెప్పాడు.

కాగా ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా 75 విజయ శాతంతో ఆగ్రస్థానంలో కొనసాగుదోంది. అదే విధంగా ఆస్ట్రేలియా 70 విజయ శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ఇక భారత్‌ 52.08 విజయ శాతంతో మూడో స్థానంలో ఉంది. కాగా గత డబ్ల్యూటీసీ(2019-21) ఫైనల్లో భారత్‌ న్యూజిలాండ్‌ జట్లు తలపడ్డాయి. అయితే ఫైనల్లో టీమిండియాపై కివీస్‌ విజయం సాధించి టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది.

డబ్ల్యూటీసీ ఫైనల్లో ప్రోటీస్,ఆస్ట్రేలియా ఢీ!
"వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు అర్హత సాధించడంలో ప్రోటీస్,ఆస్ట్రేలియా  జట్లు ముందున్నాయి. రెండు జట్లు కూడా ఇటీవల కాలంలో అద్భుతమైన  క్రికెట్‌ ఆడుతున్నాయి. శ్రీలంకతో జరిగిన అఖరి టెస్టులో  ఆస్ట్రేలియా అత్యుత్తమంగా ఆడింది. 

అయితే పాకిస్తాన్‌,భారత్‌ను కూడా తక్కువగా అంచనా వేయలేం. ఇరు జట్లులో కూడా అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. అయితే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్న భారత్‌,పాక్‌ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తే అది సంచలనమే అవుతోంది" అని ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాట్సన్‌ పేర్కొన్నాడు.
చదవండియూఏఈ టీ20 లీగ్‌లో అజం ఖాన్‌.. తొలి పాక్‌ ఆటగాడిగా!

మరిన్ని వార్తలు