శరత్‌ కమల్‌–మనిక జంటకు క్లిష్టమైన ‘డ్రా’

22 Jul, 2021 05:59 IST|Sakshi

టోక్యో ఒలింపిక్స్‌లో భారత టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) జోడీ  శరత్‌ కమల్‌–మనిక బత్రాకు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. బుధవారం విడుదల చేసిన ‘డ్రా’లో భారత జంట తొలి రౌండ్‌లో మూడో సీడ్‌ లిన్‌ యున్‌–జు, చెంగ్‌ చింగ్‌ (చైనీస్‌ తైపీ) ద్వయంతో తలపడుతుంది. మార్చిలో ఆసియా క్వాలిఫయింగ్‌ టోర్నీలో ప్రపంచ 8వ ర్యాంక్‌ జంట సాంగ్‌ సు లీ–జీ జెనోన్‌ (దక్షిణ కొరియా)పై నెగ్గి శరత్‌ కమల్‌–మనిక జోడీ టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌ దక్కించుకుంది.  

మరిన్ని వార్తలు