Shelley Nitschke: ఆస్ట్రేలియా జట్టు హెడ్‌కోచ్‌గా షెల్లీ నిట్ష్కే..

20 Sep, 2022 15:57 IST|Sakshi

ఆస్ట్రేలియా మహిళల జట్టు హెడ్‌ కోచ్‌గా ఆ దేశ మాజీ క్రికెటర్‌ షెల్లీ నిట్ష్కే ఎంపికయ్యంది. ఈ విషయాన్ని క్రికెట్‌ ఆస్ట్రేలియా మంగళవారం వెల్లడించింది . షెల్లీ నిట్ష్కే నాలుగేళ్ల పాటు ఆస్ట్రేలియా మహిళలల జట్టుకు హెడ్‌కోచ్‌గా పనిచేయనుంది. కాగా అంతకుముందు ఆసీస్‌ హెడ్‌ కోచ్‌గా పనిచేసిన మథ్యూ మాట్‌ స్థానంలో ఆమె బాధ్యతలు చేపట్టనుంది.

ప్రపంచంలోనే అత్యత్తుమ ఆల్‌రౌండర్‌గా పేరొందిన షెల్లీ నిట్ష్కే.. ఆస్ట్రేలియా తరపున 80 వన్డేలు, 36 టీ20లు, 6 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించింది. ఆమె తన కెరీర్‌లో 3000 పైగా పరుగులతో పాటు, 150 వికెట్లు పడగొట్టింది. ఇక కోచ్‌గా కూడా షెల్లీ నిట్ష్కేకు అపారమైన అనుభవం ఉంది. 2011లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆమె దేశీవాళీ జట్టు సౌత్‌ ఆస్ట్రేలియాకు కోచ్‌గా కూడా పని చేసింది.

అదే విధంగా 2018లో ఆస్ట్రేలియా జట్టు మహిళలల ఆస్టెంట్‌ కోచ్‌గా ఆమె పనిచేసింది. మరోవైపు 2019 నుంచి బిగ్‌బాష్‌ లీగ్‌లో పెర్త్‌ స్కార్చర్‌ జట్టు హెడ్‌కోచ్‌గా ఆమె బాధ్యతలు నిర్వహిస్తుంది. అయితే తాజాగా ఆసీస్‌ కోచ్‌గా ఎంపిక కావడంతో  పెర్త్‌ స్కార్చర్‌ జట్టు హెడ్‌కోచ్‌ బాధ్యతల నుంచి ఆమె తప్పుకోనుంది.
చదవండి: Ind Vs Aus: అరుదైన ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో రోహిత్‌ శర్మ! రెండు భారీ షాట్లు కొడితే..

మరిన్ని వార్తలు