‘కేకేఆర్‌ పార్టీలో కొకైన్‌ వాడారు.. గుట్టు విప్పుతా’

24 Sep, 2020 17:25 IST|Sakshi

ముంబై: గత కొంతకాలంగా బాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్‌ ఉదంతం ఇప్పుడు క్రికెట్‌కు కూడా పాకినట్లుంది.  కొంతమంది క్రికెటర్లు డ్రగ్స్‌ తీసుకున్నారంటూ బాలీవుడ్‌ నటి, మోడల్‌ షెర్లిన్‌ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. పలువురు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాళ్లు డ్రగ్స్‌ తీసుకున్నారంటూ ఆరోపించారు. ప్రస్తుతం కేకేఆర్‌లో ఆడుతున్న ప్లేయర్లు.. ఆ జట్టు పార్టీ చేసుకునే క్రమంలో కొకైన్‌ తీసుకున్నారని వ్యాఖ్యానించారు. అయితే ఎప్పుడు తీసుకున్నారనేది ఆమె వెల్లడించలేదు. తాను ఐపీఎల్‌ మ్యాచ్‌ను చూడటానికి వెళ్లిన క్రమంలో కేకేఆర్‌ జట్టు పార్టీ చేసుకుందని, అందులో కొకైన్‌ కూడా ఉందన్నారు. (చదవండి: ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ డీన్‌జోన్స్‌ ఇకలేరు..)

మ్యాచ్‌ సెలబ్రేషన్‌లో భాగంగా ఇది జరిగినట్లు షెర్లిన్‌ తెలిపారు. ఏబీపీ న్యూస్‌తో గురువారం మాట్లాడిన షెర్లిన్‌.. ఒకనాటి ఐపీఎల్‌ మ్యాచ్‌లో డ్రగ్స్‌ తీసుకున్న సంగతిని వెల్లడించారు. ‘కేకేఆర్‌  విజయోత్సవ సెలబ్రేషన్స్‌లో కొకైన్‌ తీసుకోవడం నేను చూశా. ఆ పార్టీకి పాపులర్‌ క్రికెటర్లతో పాటు వారి భార్యలు కూడా వచ్చారు. ఆ పార్టీకి నన్ను ఆహ్వానించారు. నేను ఆ పార్టీని ఎంజాయ్‌ చేస్తుండగా ఒక్కసారిగా షాకయ్యా. అందుకు కారణం వారు వాష్‌రూమ్‌లో కొకైన్‌ తీసుకోవడమే’ అని షెర్లిన్‌ తెలిపారు. కాకపోతే ఏ క్రికెటర్‌ తీసుకున్నాడు, ఎప్పుడు తీసుకున్నాడో అనే విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు. ఈ విషయంలో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్సీబీ) తన సాయం కోరితే కచ్చితంగా వారికి తెలియజేస్తానని షెర్లిన్‌ తెలిపారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు