పొలార్డ్‌ కళ్లు చెదిరే త్రో.. ధావన్‌ పేరిట చెత్త రికార్డు

2 Oct, 2021 19:25 IST|Sakshi
Courtesy: IPL Twitter

Shikar Dhawan Run Out By Pollard Stunning Throw..  ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌ కళ్లు చెదిరే త్రోతో మెరిశాడు. దీంతో శిఖర్‌ ధావన్‌ రనౌట్‌ కావడంతో పాటు ఐపీఎల్‌ చరిత్రలో చెత్త రికార్డు నమోదు చేశాడు. జయంత్‌ యాదవ్‌ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ ఆఖరి బంతిని ధావన్‌ మిడాన్‌ దిశగా షాట్‌ ఆడాడు. అయితే రిస్క్‌ అని తెలిసినా ధవన్‌ అనవసర సింగిల్‌కు ప్రయత్నించాడు.

ఇంకేముంది అక్కడే ఉన్న పొలార్డ్‌ బంతిని అందుకొని డైరెక్ట్‌ త్రో విసిరాడు. ధవన్‌ క్రీజులోకి చేరేలోపే బంతి వికెట్లను గిరాటేయడంతో రనౌట్‌ అయ్యాడు. కాగా ధవన్‌ రనౌట్ల విషయంలో ఒక చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో 16 సార్లు రనౌట్‌ అయిన ధావన్‌.. గంభీర్‌తో సమానంగా తొలిస్థానంలో నిలిచాడు. ఆ తర్వాత సురేశ్‌ రైనా 15 సార్లు రనౌట్‌తో రెండో స్థానంలో.. అంబటి రాయుడు, డివిలియర్స్‌లు 13 సార్లు రనౌట్‌ అయి మూడవ స్థానంలో నిలిచారు.

ఇక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్లే ఆఫ్‌ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. మరోవైపు ఓటమితో ముంబై ఇండియన్స్‌ ప్లే ఆఫ్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

మరిన్ని వార్తలు