దక్షిణాఫ్రికాతో సిరీస్‌: వన్డేలకు మిథాలీ, టీ20లకు హర్మన్‌ప్రీత్‌

28 Feb, 2021 09:43 IST|Sakshi

శిఖా పాండేపై వేటు

న్యూఢిల్లీ: వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో లక్నోలో జరిగే మూడు వన్డేలు, ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొనే భారత మహిళల క్రికెట్‌ జట్లను ప్రకటించారు. వెటరన్‌ మీడియం పేసర్‌ శిఖా పాండేతోపాటు వికెట్‌ కీపర్‌ తాన్యా భాటియా, వేద కృష్ణమూర్తిలకు రెండు జట్లలోనూ చోటు లభించలేదు. 31 ఏళ్ల శిఖా పాండే భారత్‌ తరఫున 52 వన్డేలు ఆడి 73 వికెట్లు... 50 టి20 మ్యాచ్‌లు ఆడి 36 వికెట్లు తీసింది. వన్డే జట్టుకు హైదరాబాదీ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌... టి20 జట్టుకు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్‌లుగా వ్యవహరిస్తారు. టి20 జట్టులో హైదరాబాద్‌ పేస్‌ బౌలర్‌ అరుంధతి రెడ్డి తన స్థానాన్ని నిలబెట్టుకుంది.  

భారత మహిళల వన్డే జట్టు: మిథాలీ రాజ్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, పూనమ్‌ రౌత్, ప్రియా పూనియా, యస్తిక భాటియా, హర్మన్‌ప్రీత్‌ కౌర్, హేమలత, దీప్తి శర్మ, సుష్మా వర్మ, శ్వేత వర్మ, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, జులన్‌ గోస్వామి, మాన్సి జోషి, పూనమ్‌ యాదవ్, ప్రత్యూష, మోనికా పటేల్‌.

భారత మహిళల టి20 జట్టు: హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్, హర్లీన్‌ డియోల్, సుష్మా వర్మ, నుజత్‌ పర్వీన్, అయూషి సోని, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్‌ యాదవ్, మాన్సి జోషి, మోనికా పటేల్, ప్రత్యూష, సిమ్రన్‌.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు