ఈ లైలా న‌న్ను పిచ్చెక్కిస్తోంది: శిఖ‌ర్‌

18 Nov, 2020 18:32 IST|Sakshi

సిడ్నీ: టెస్టు, వ‌న్డే, టి20 కోసం భార‌త జ‌ట్టు ఆట‌గాళ్లు ఇప్ప‌టికే ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. న‌వంబ‌ర్ 27న సిడ్నీలో జ‌రిగే తొలి వ‌న్డే మ్యాచ్‌తో ఇరు జ‌ట్ల మ‌ధ్య సిరీస్ ప్రారంభం కానుంది. దీనికోసం భార‌త జ‌ట్టు ఆదివారం నుంచి నెట్ ప్రాక్టీస్ సెష‌న్ కూడా ప్రారంభించింది. అయితే ప్రాక్టీస్ మ‌ధ్య‌లో బ్యాట్స్‌మెన్లు శిఖ‌ర్ ధావ‌న్‌, పృథ్వీషా మాత్రం మ‌రో ప‌నిలో బిజీబిజీగా క‌నిపించారు. బాలీవుడ్ పాట‌కు స‌ర‌దాగా డ్యాన్స్ చేశారు. అందులో పృథ్వీ అమ్మాయిగా వ‌య్యారంగా న‌డిచారు. హీరోయిన్ వెంట ప‌డుతున్న హీరోలా శిఖ‌ర్ పృథ్వీని అనుస‌రిస్తూ తన చొక్కాను విప్పేశారు. అభిమానుల‌ను న‌వ్విస్తున్న ఈ క్రేజీ డ్యాన్స్ వీడియోను శిఖ‌ర్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. 'ఈ లైలా ఇప్ప‌టికీ న‌న్ను పిచ్చెక్కిస్తోంది..' అని క్యాప్ష‌న్ జోడించారు. ఇది చూసిన అభిమానులు లైలా భ‌లేగుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. (చ‌ద‌వండి: వరుసగా శతకాలు.. వరుసగా డక్‌లు!)

ఇదిలా వుంటే ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ర‌పున ఆడిన‌ శిఖ‌ర్ ఈ ఏడాది ఐపీఎల్‌లో వ‌రుస‌గా రెండు సెంచ‌రీలు చేసి రికార్డు సృష్టించారు. అంతే కాకుండా 618 ప‌రుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో నిలిచారు. కాగా టెస్టు, టి20 త‌ర్వాత జ‌రిగే వ‌న్డే మ్యాచ్‌కు అడిలైడ్ వేదిక కానుంది. అయితే తొలి టెస్టు వీక్షించేందుకు స్టేడియంలోకి స‌గం మంది ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించాని నిర్ణయించారు. కానీ అడిలైడ్‌లో క‌రోనా కేసులు రోజురోజుకూ పెరుగిపోతుండ‌టం అంద‌రినీ ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. దీంతో డిసెంబ‌రు 17  నాటికి పరిస్థితి మార‌క‌పోతే ప్రేక్ష‌కులు లేకుండానే తొలి టెస్టు మ్యాచ్ జ‌రిగే అవ‌కాశం ఉంది. (చ‌ద‌వండి: టీమిండియా ప్రాక్టీస్‌ షురూ)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా