Rishabh Pant: మూడేళ్ల క్రితమే పంత్‌ను హెచ్చరించిన ధావన్‌

30 Dec, 2022 19:28 IST|Sakshi

టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ రోడ్డు ప్రమాదానికి గురవ్వడం అభిమానులను ఆందోళన పరిచింది. శుక్రవారం తెల్లవారుజామున ఉత్తరాఖండ్‌లోని రూర్కీ సమీపంలో పంత్‌ కారు ప్రమాదానికి గురయ్యింది. ఢిల్లీవైపు నుంచి వేగంగా వచ్చిన కారు డివైడర్‌ను ఢీకొట్టి 200 మీటర్ల దూరం దూసుకెళ్లింది. ఆపై కారుకు మంటలు అంటుకోవడం.. పంత్‌ కారు నుంచి బయటపడడంతో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది.

ప్రస్తుతం పంత్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని బీసీసీఐ తమ ప్రకటనలో తెలిపింది. గాయాల తీవ్రత ఎక్కువగానే ఉన్నప్పటికి పంత్‌ కోలుకుంటాడని పేర్కొంది. ఇదిలా ఉంటే మూడేళ్ల క్రితమే క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌.. పంత్‌ను డ్రైవింగ్‌ విషయంలో హెచ్చరించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఐపీఎల్‌ 2019 సమయంలో పంత్‌, ధావన్‌లు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా ఇద్దరు సరదాగా ఒకరినొకరు ఇంటర్య్వూ చేసుకున్నారు. ఆ సమయంలో తనకంటే సీనియర్‌ అయిన ధావన్‌ను.. భయ్యా ఒక సీనియర్‌గా నువ్వు నాకు ఏమి అడ్వైజ్‌ ఇస్తావు అని అడిగాడు. దీనికి బదులుగా ధావన్‌.. ''డ్రైవింగ్‌ విషయంలో కాస్త జాగ్రత్త వహించు'' అని పేర్కొన్నాడు. తాజాగా పంత్‌ కారు ప్రమాదం బారిన పడడంతో ధావన్‌-పంత్‌ల పాత వీడియో మరోసారి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. 

చదవండి: పంత్‌ను కాపాడిన బస్‌ డ్రైవర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

రిషభ్‌ పంత్‌కు ప్రమాదం.. ప్రార్థిస్తున్నా అంటూ ఊర్వశీ రౌతేలా పోస్ట్‌

మరిన్ని వార్తలు