Shikar Dhawan: 'ఆపండి రా నాయనా'.. మీ అతి ప్రేమతో చంపేటట్లున్నారు!

10 Aug, 2022 19:28 IST|Sakshi

టీమిండియా వెటరన్‌ ఆటగాడు శిఖర్‌ ధావన్‌ ఫన్నీ వీడియోలు చేయడంలో ఎప్పుడు ముందుంటాడు. ఆటలో ఎంత దూకుడు కనబరుస్తాడో.. బయట అంత ఫన్నీగా ఉంటాడు. తనదైన హ్యూమర్‌ను జత చేసి అభిమానులకు నవ్వు తెప్పించిన సందర్భాలు కొకొల్లలు. తండ్రితో ధావన్‌ చెంపదెబ్బలు తిన్న వీడియో ఎంత వైరల్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా అలాంటి ఫన్నీ వీడియోనే మరొకటి మన ముందుకు తీసుకొచ్చాడు.

మనం ఎవరైనా తెలిసిన వాళ్ల ఇంటికి మొదటిసారి వెళితే.. వాళ్లు చేసి అతిథి మర్యాదలు మాములుగా ఉండవు. ముఖ్యంగా తిండి తినే సమయంలో ఇలాంటి ప్రేమలు ఎక్కువగా కనిపిస్తాయి. మనం వద్దన్నా సరే తినండి.. తినండి అంటూ వడ్డించేస్తారు. అలాంటి సందర్బంలో వారి అతి ప్రేమను తట్టుకోవడం కష్టమవుతుంది. ఏమైనా చెబుదామంటే మొహమాటం అడ్డు వస్తుంది. ఇలాంటి అనుభవాలు మీకు కూడా చాలానే ఎదురయ్యే ఉంటాయి.

తాజాగా ధావన్‌ ఇదే అంశాన్ని తీసుకొని ఒక ఫన్నీ వీడియో తయారు చేశాడు. ధావన్‌ డైనింగ్‌టేబుల్‌పై కూర్చొని ఉంటాడు. అతని ప్లేట్‌లో అప్పటికే రోటీలు, కర్రీలు, అన్నం, కప్పు సలాడ్‌తో నింపేశారు. ధావన్‌ ఇంకా తినడం ప్రారంభించకముందే పక్కన ఉన్న ఇద్దరు సర్వర్లు వడ్డిస్తూనే ఉ‍న్నారు. ఈ నేపథ్యంలో ధావన్‌.. ''అరె భయ్యా ప్లేట్‌ ఖాళీ లేదు.. కాసేపు ఆగండి'' అని అన్నాడు. కానీ ధావన్‌ మాటను లెక్కచేయని సర్వర్లు..''అరె మీ ప్లేట్‌లో చాలా ఖాళీ ఉంది.. ముందు మీరు తినండి'' అని పేర్కొన్నారు.

దీంతో ధావన్‌ ''మీ ప్రేమ తగలయ్యా.. తిండి పెట్టి పెట్టి నన్ను చంపేటట్లున్నారు.'' అని కామెంట్‌ చేశాడు. ప్రస్తుతం ధావన్‌ వీడియో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ఇప్పటికే వీడియోకు రెండు మిలియన్‌ వ్యూస్‌ రాగా.. మూడు లక్షల లైకులు.. 2వేల కామెంట్లు వచ్చాయి. కాగా ధావన్‌(గబ్బర్‌)కు ఇన్‌స్టాగ్రామ్‌లో 11.1 మిలియన్‌ ఫాలోవర్లు ఉండడం విశేషం.

ఇక పరిమిత ఓవర్ల(50 ఓవర్లు) ఆటకు మాత్రమే పరిమితమైన శిఖర్‌ ధావన్‌ తనకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటునే వస్తున్నాడు.  ఇటీవలే వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో అటు కెప్టెన్‌గా.. బ్యాటర్‌గా గబ్బర్‌ అదరగొట్టాడు. విండీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి టీమిండియాకు సిరీస్‌ అందించడంతో పాటు మూడు వన్డేలు కలిపి 168 పరుగులు చేశాడు. తొలి వన్డేలో 97 పరుగుల వద్ద ఔటై తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని జారవిడుచుకున్నాడు. 

A post shared by Shikhar Dhawan (@shikhardofficial)

చదవండి: Ishan Kishan: ఎంపిక చేయలేదన్న కోపమా?.. పాట రూపంలో నిరసన

Sachin-Yuvraj: కొత్త వేషంలో టీమిండియా దిగ్గజం.. టీజ్‌ చేసిన యువీ

కాబోయే భార్యతో సాగర తీరంలో టీమిండియా ఆల్‌రౌండర్‌.. ఫొటోలు వైరల్‌

మరిన్ని వార్తలు