NZ vs WI: న్యూజిలాండ్‌తో తొలి వన్డే‍.. ఆరేళ్ల తర్వాత విండీస్‌ ఆటగాడు రీ ఎంట్రీ!

17 Aug, 2022 12:21 IST|Sakshi

న్యూజిలాండ్‌తో తొలి వన్డే‍కు ముందు వెస్టిండీస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఆటగాడు షిమ్రాన్ హెట్‌మైర్‌తో సహా ఆల్‌రౌండర్‌ కీమో పాల్, స్పిన్నర్‌ గుడాకేష్‌ మోటీ కివీస్‌ సిరీస్‌ మొత్తానికి దూరమయ్యారు. హెట్‌మైర్‌ వ్యక్తిగత కారణాల వల్ల ఈ సిరీస్‌ నుంచి వైదొలగగా..  కీమో పాల్,మోటీ గాయం కారణంగా తప్పుకున్నారు.

ఇక హెట్‌మైర్‌ స్థానంలో  జెర్మైన్ బ్లాక్‌వుడ్‌ను విండీస్‌ క్రికెట్‌ ఎంపిక చేసింది. బ్లాక్‌వుడ్‌ టెస్టు క్రికెట్‌లో క్రమం తప్పకుండా ఆడుతున్నప్పటికీ.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం అతడికి గత కొన్నాళ్లుగా చోటు దక్కడం లేదు. బ్లాక్‌వుడ్‌ చివరగా 2015లో విండీస్‌ తరపున వన్డేల్లో ఆడాడు. ఇక గుడాకేష్‌ మోటీ స్థానంలో లెగ్ స్పిన్నర్ యాన్నిక్ కారియాకు చోటు దక్కింది.

ఈ సిరీస్‌తో కారియా విండీస్‌ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నాడు. దేశీవాళీ టోర్నీల్లో అద్భుతంగా రాణించడంతో కారియాను ఎంపిక చేశారు. ఇక ఇప్పటికే న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను కోల్పోయిన విండీస్‌ కనీసం​ వన్డే సిరీస్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది.  కింగ్‌స్టన్‌ ఓవల్ వేదికగా బుధవారం జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. కాగా ఇరు జట్లు మధ్య మూడు వన్డేలు కూడా కింగ్‌స్టన్‌ ఓవల్ వేదికగానే జరగనున్నాయి.

కివీస్‌తో వన్డే సిరీస్‌కు విండీస్‌ జట్టు
నికోలస్ పూరన్ (కెప్టెన్‌), షాయ్ హోప్ (వైస్‌ కెప్టెన్‌), షమర్ బ్రూక్స్, కీసీ కార్టీ, బ్లాక్‌వుడ్‌, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, యాన్నిక్ కారియా,  జేడెన్ సీల్స్, కెవిన్ సింక్లైర్.
చదవండి: India Tour Of Zimbabwe: విలేఖరి అడిగిన ఓ ప్రశ్నకు బిక్క మొహం వేసిన ధవన్‌

మరిన్ని వార్తలు