Shoaib Akhtar Biopic: పట్టాలెక్కనున్న షోయబ్‌ అక్తర్‌ Rawalpindi Express

25 Jul, 2022 17:43 IST|Sakshi

పాకిస్థాన్‌ మాజీ స్పీడ్‌స్టర్‌ షోయబ్‌ అక్తర్‌ జీవిత కథ ఆధారంగా బయోపిక్‌ తెరకెక్కనుంది. ఈ విషయాన్ని అక్తరే స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించాడు. ఈ చిత్రానికి ‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్’ అనే పేరును ఖరారు చేస్తూ.. 'రన్నింగ్‌ అగెయిన్స్ట్‌ ది ఆడ్స్‌' అంటూ టైటిల్‌ క్యాప్షన్‌ను జోడించాడు. అందమైన ప్రయాణానికి ఇది ప్రారంభం.. ఈ సినిమా ద్వారా ఇప్పటివరకు వెళ్లని రైడ్‌కు మీరు వెళ్లనున్నారు.. పాకిస్తాన్ క్రీడాకారునికి సంబంధించి ఇది తొలి విదేశీ చిత్రం.. వివాదాస్పదంగా మీ షోయబ్‌ అక్తర్ అంటూ అక్తర్‌ తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు.

బయోపిక్‌కు సంబంధించిన గ్లింప్స్‌ను అక్తర్‌ ట్విటర్‌ ద్వారా విడుదల చేస్తూ.. 2023 నవంబర్ 16న సినిమా విడుదల అవుతుందని స్ఫష్టం చేశాడు. పాక్‌ దర్శకుడు ముహమ్మద్‌ ఫరాజ్ కైజర్ ఈ బయోపిక్‌ను తెరకెక్కించనున్నాడు. ఈ బయోపిక్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పాకిస్థాన్‌లోని రావల్పిండి ప్రాంతానికి చెందిన అక్తర్‌ తన క్రికెట్‌, క్రికెటేతర జీవితంలోని అనుభవాల ఆధారంగా ఈ సినిమాను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. గతంలో భారత క్రికెటర్లు సచిన్, ధోని, మిథాలీ రాజ్‌, ప్రవీణ్ తాంబేల బయోపిక్‌లు విడుదలైన సంగతి తెలిసిందే. 1997లో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన అక్తర్.. 13 ఏళ్ల కెరీర్‌లో 46 టెస్ట్‌లు, 163 వన్డేలు, 15 టీ20లు ఆడి ఓవరాల్‌గా 444 వికెట్లు పడగొట్టాడు. 
చదవండి: Ind Vs WI: మీ అత్యుత్తమ స్పిన్నర్‌ ఎవరో తెలియదా? అతడి విషయంలో ఎందుకిలా?

మరిన్ని వార్తలు