ఒకే జట్టులో సచిన్, ధోని,యువరాజ్‌.. కోహ్లి, రోహిత్‌కు నోఛాన్స్‌!

31 Dec, 2021 10:31 IST|Sakshi

పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ ప్రపంచంలోనే అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు. తన జట్టులో నలుగురు భారత ఆటగాళ్లకు అవకాశం ఇచ్చాడు. కాగా తన జట్టులో ఓపెనర్లుగా గాడ్‌ ఆఫ్‌ క్రికెట్‌ సచిన్ టెండూల్కర్‌, వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు గోర్డాన్ గ్రీనిడ్జ్‌ని ఎంచుకున్నాడు. పాక్‌ మాజీ కెప్టెన్‌ ఇంజమామ్-ఉల్-హక్‌, సయీద్ అన్వర్‌కి వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో చోటు కల్పించాడు.

ఐదో స్ధానంలో భారత మాజీ కెప్టెన్‌ ధోనికి అవకాశం ఇచ్చాడు. ఆరో స్ధానంలో ఆస్ట్రేలియా మాజీ వికెట్‌ కీపర్‌ ఆడం గిల్‌క్రిస్ట్‌కి చోటు దక్కింది. ఇక ఆల్‌రౌండర్ల కోటాలో కపిల్‌దేవ్‌, యువరాజ్‌ సింగ్‌ను అక్తర్‌ ఎంపిక చేశాడు. తన జట్టులో ఏకైక స్పిన్నర్‌గా షేన్‌ వార్న్‌ను ఎంచుకున్నాడు. ఇక ఫాస్ట్‌ బౌలర్ల కోటాలో ఇక బౌలర్ల కోటాలో వసీం అక్రమ్, వకార్ యూనిస్‌కు చోటు దక్కింది. కాగా అక్తర్‌ ప్రకటించిన జట్టులో భారత స్టార్‌ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లికి చోటు దక్కలేదు.

షోయబ్ అక్తర్ ఆల్ టైమ్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌: సచిన్ టెండూల్కర్, గోర్డాన్ గ్రీనిడ్జ్, ఇంజమామ్-ఉల్-హక్, సయీద్ అన్వర్, మహేంద్ర సింగ్ ధోనీ, ఆడమ్ గిల్‌క్రిస్ట్, యువరాజ్ సింగ్, షేన్ వార్న్ (కెప్టెన్), వసీం అక్రమ్, కపిల్ దేవ్, వకార్ యూనిస్

చదవండి: IND Vs SA: భారత్‌తో ఓటమి.. దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ సంచలన నిర్ణయం!

మరిన్ని వార్తలు