కెప్టెన్‌ చెప్పిన వాళ్లను ఎంపిక చేయరు.. మా పద్దతి అదే

16 May, 2021 22:22 IST|Sakshi

కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ జట్టు.. తాజాగా సౌతాఫ్రికా, జింబాబ్వే పర్యటనలకు వెళ్లివచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు సిరీసుల్లో కూడా పాక్ కెప్టెన్‌ బాబర్ ఆజామ్ కోరుకున్నట్లుగా జట్టును ఎంపిక చేయలేదని ఆ జట్టు సీనియర్‌ ఆటగాడు షోయబ్‌ మాలిక్‌ పేర్కొన్నాడు.

'' కెప్టెన్ బాబర్‌ అడిగిన చాలా మంది ఆటగాళ్లను ఇటీవలి దక్షిణాఫ్రికా, జింబాబ్వే సిరీసులకు తీసుకోలేదు. తమ వద్ద నచ్చడం.. నచ్చకపోవడం అనే పద్దతి ఉంది. సెలక్షన్‌ ప్రక్రియలో ఇతరుల అభిప్రాయాలకు విలువ ఉన్నా తుది నిర్ణయం తీసుకోవాల్సింది కెప్టెనే. ఇంకోవిషయం ఏంటంటే ఆటగాళ్ల ఎంపికలో పక్షపాత ధోరణి నడుస్తుంది. ఇది సరైనది కాదు.. పీఎస్‌ఎల్‌ ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయాలి. కనీసం రెండు సీజన్ల పాటు అందులో ఆడే ఆటగాళ్లను పరిశీలించి అప్పుడు జట్టులోకి తీసుకోవాలి. ఈ విషయాన్ని ఇలా బయటపెట్టడం వల్ల నాకే నష్టం జరిగినా పరవాలేదు. నన్ను మళ్లీ టీ20ల్లో ఆడనివ్వకపోయినా నేనేమి బాధపడను. నేను ఇప్పటివరకు ఎంతోమంది కెప్టెన్లతో ఆడాను. వకార్‌ యూనిస్‌, వసీమ్‌ అక్రమ్‌, ఇంజమామ్‌, అఫ్రిది లాంటి దిగ్గజాలతో ఆడాను. కెప్టెన్‌గా ఉండాలంటూ ఇతరులను కాకా పట్టడం చేయొద్దు. అలా చేయకుండా ఉంటే తప్పకుండా గొప్ప కెప్టెన్‌గా మిగిలిపోతారు.'' అంటూ చెప్పుకొచ్చాడు. 
చదవండి: 'విమర్శలు పట్టించుకోం.. మా పనేంటో మాకు తెలుసు'

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు