రవి దహియాకు షాక్‌ 

24 Jul, 2023 03:42 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత స్టార్‌ రెజ్లర్‌ రవి దహియా ఆసియా క్రీడలకు అర్హత సాధించలేకపోయాడు. టోక్యో ఒలింపిక్స్‌లో రజతం, కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం, వరుసగా మూడేళ్లు ఆసియా చాంపియన్‌గా నిలిచిన రవి దహియా (57 కేజీలు) ఆదివారం నిర్వహించిన సెలెక్షన్‌ ట్రయల్స్‌లో ఆతీశ్‌ తోడ్కర్‌ (మహారాష్ట్ర) చేతిలో అనూహ్యంగా ఓడిపోయాడు.

అయితే ఈ విభాగంలో అమన్‌ సెహ్రావత్‌ విజేతగా నిలిచి ఆసియా క్రీడల బెర్త్‌ను దక్కించుకున్నాడు. ఇతర విభాగాల్లో దీపక్‌ పూనియా (86 కేజీలు), విక్కీ (97 కేజీలు), యశ్‌ (74 కేజీలు), సుమిత్‌ మలిక్‌ (125 కేజీలు), విశాల్‌ కాళీరామన్‌ (65 కేజీలు) విజేతలుగా నిలిచారు. 65 కేజీల విభాగంలో బజరంగ్‌ పూనియాకు నేరుగా ఆసియా క్రీడల్లో ఆడే అవకాశం కల్పించడంతో విశాల్‌ ‘స్టాండ్‌బై’గా ఉంటాడు.   

>
మరిన్ని వార్తలు