Sreehari Nataraj: 'మెడల్స్‌ అక్కడే వదిలేసి రమ్మంటారా?'.. స్టార్‌ స్విమ్మర్‌కు అవమానం

11 Oct, 2022 12:53 IST|Sakshi

భారత స్టార్‌ స్విమ్మర్‌ శ్రీహరి నటరాజ్‌కు చేదు అనుభవం ఎదురైంది. నటరాజ్‌తో పాటు అతని బృందానికి ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది భారీ జరిమానా  విధించింది. లగేజీ ఎక్కువగా ఉండమే దీనికి కారణం అని తెలిసింది. అయితే లగేజీలో ఉన్నవాటిలో ఎక్కువమొత్తంలో మెడల్స్‌ ఉన్నాయి. వాటి బరువు వల్లే లగేజీ బరువు పెరిగిపోయిందని శ్రీహరి నటరాజ్‌ బృందం పేర్కొంది. 36వ జాతీయ క్రీడలు ముగించుకొని వస్తున్న సమయంలో గుజరాత్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇదే విషయమై శ్రీహరి నటరాజ్‌ మాట్లాడుతూ.. '' గుజరాత్‌లో జరిగిన 36వ జాతీయ క్రీడలు ముగించుకొని మా బృందంతో కలిసి ఎయిర్‌పోర్ట్‌కు వచ్చాను. కానీ ఇండిగో సిబ్బంది మాతో దురుసుగా ప్రవర్తించడమే గాక అదనపు లగేజీ కారణంగా భారీ జరిమానా విధించారు. అయితే అదనపు లగేజీగా భావిస్తున్న వాటిలో మెడల్స్‌, అథ్లెట్స్‌కు సంబంధించిన వస్తువులే ఉన్నాయి. నిజాయితీగా చెప్పాలంటే వారి విధించిన జరిమానా మాకు పెద్ద విషయం కాకపోవచ్చు..కానీ నాతో పాటు మా బృందాన్ని ట్రీట్‌ చేసిన తీరు బాగాలేదు. సిబ్బంది తీరు చూస్తుంటే ఎక్కడ మెడల్స్‌ గెలిచామో అదే స్థలంలో విడిచిపెట్టాలన్నట్లుగా ఉంది.'' అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇక జాతీయ క్రీడల్లో తొలిసారి పాల్గొన్న శ్రీహరి నటరాజ్‌ అదరగొట్టాడు. జాతీయ క్రీడల్లో కర్నాటక తరపున పాల్గొన్న నటరాజ్‌ వివిధ విభాగాలు కలిపి ఆరు గోల్డ్‌ మెడల్స్‌ గెలుచుకున్నాడు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ ఈవెంట్‌లో మంచి ప్రదర్శన కనబరిచిన శ్రీహరి నటరాజ్‌ తృటిలో పతకం కోల్పోయినప్పటిక A-స్టాండర్డ్‌లో చోటు సంపాదించాడు. ఆ తర్వాత కామన్‌వెల్త్‌ గేమ్స్‌లోనూ పతకం సాధించడంలో విఫలమైనప్పటికి 100 మీ, 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ ఈవెంట్స్‌లో మంచి ప్రదర్శన కనబరిచాడు. 

చదవండి: పుట్టినరోజున హార్దిక్‌ పాండ్యా ఎమోషనల్‌..

బెలూన్‌ వరల్డ్‌కప్‌.. క్రీడాకారిణి ప్రాణం మీదకు

మరిన్ని వార్తలు