IND vs BAN: శ్రేయస్‌ అయ్యర్‌ అరుదైన రికార్డు.. తొలి భారత ఆటగాడిగా

14 Dec, 2022 16:30 IST|Sakshi

టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌ అరుదైన ఘనత సాధించాడు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్‌లు కలిపి అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా శ్రేయస్‌ అయ్యర్‌ నిలిచాడు. ఛాటోగ్రామ్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 21 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద అయ్యర్‌ ఈ రికార్డు సాధించాడు. 

ఇప్పటి వరకు ఈ ఏడాది ఈ ఏడాది అన్ని ఫార్మాట్‌ల్లో 36 ఇన్నింగ్స్‌లు ఆడి 1486 పరుగులు సాధించాడు.  కాగా ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 82 పరుగులతో అయ్యర్‌ ఇంకా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ఇక  అంతకుముందు ఈ రికార్డు భారత విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ పేరిట ఉండేది.

సూర్య ఈ ఏడాది అన్ని ఫార్మాట్‌ల్లో కలిపి 43 ఇన్నింగ్స్‌లలో 1424 పరుగులు సాధించాడు. తాజా మ్యాచ్‌తో సూర్య రికార్డును అయ్యర్ బ్రేక్‌ చేశాడు. సూర్య తర్వాతి స్థానంలో భారత వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌(1232) పరుగులతో ఉన్నాడు.

మరిన్ని వార్తలు