ఆసీస్‌తో వన్డే సిరీస్‌.. టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ దూరం 

15 Mar, 2023 09:12 IST|Sakshi

ఆ్రస్టేలియా జట్టుతో ఈనెల 17న మొదలుకానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు భారత బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ వెన్ను నొప్పి కారణంగా దూరమయ్యాడు. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023 నాలుగో టెస్ట్‌ సందర్భంగా అయ్యర్‌కు వెన్ను నొప్పి తిరగబెట్టడంతో ఆట మధ్యలోనే మైదానాన్ని వీడాడు. అయ్యర్‌ స్థానాన్ని త్వరలోనే భర్తీ చేస్తామని సెలెక్షన్‌ కమిటీ వెల్లడించింది. 

కాగా, ఈనెల 31న ఆరంభంకానున్న ఐపీఎల్‌ టోర్నీలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు అయ్యర్‌ సారథ్యం వహించాల్సి ఉన్న విషయం తెలిసిందే. గాయం తీవ్రత కారణంగా ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లకు కూడా అయ్యర్‌ అందుబాటులో ఉండటం సందేహంగా మారింది.    

మరిన్ని వార్తలు