కోలుకోవడానికి కనీసం 5నెలలు పట్టొచ్చంటున్న డాక్టర్లు 

29 Mar, 2021 21:52 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో బౌండరీని ఆపే క్రమంలో గాయం బారిన పడిన టీమిండియా స్టార్‌ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు తగిలిన గాయం చాలా తీవ్రమైందని, ఏప్రిల్‌ 8న ఆయనకు శస్త్ర చికిత్స చేయనున్నామని, అతను కోలుకోవడానికి కనీసం 5 నెలలు పడుతుందని డాక్టర్లు వెల్లడించారు. గాయం కారణంగా ఇంగ్లండ్‌తో ఆఖరి రెండు వన్డేలకు దూరమైన అయ్యర్‌.. ఏప్రిల్‌ 9 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్‌ 2021 సీజన్‌ మొత్తానికి, అలాగే ఆగస్టులో జరిగే ఇంగ్లండ్‌ పర్యటనకు దూరంకానున్నాడు. సొంతగడ్డపై సెప్టెంబర్‌లో న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికాలతో జరిగే టీ20 సిరీస్‌లకు అతడు మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అయ్యర్‌ స్థానంలో యాజమాన్యం కొత్త సారథిని ప్రకటించాల్సి ఉంది. కాగా, ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా అయ్యర్‌ ఎడమ భుజానికి గాయమైన విషయం తెలిసిందే. 
చదవండి: ప్రపంచకప్‌ సూపర్‌ లీగ్‌లో మెరుగుపడిన టీమిండియా స్థానం
 

మరిన్ని వార్తలు