Asia Cup 2022: ఏంటి రాహుల్‌ ఇది.. టెస్టు ఇన్నింగ్స్‌ బాగా ఆడావు!

1 Sep, 2022 11:10 IST|Sakshi

ఆసియాకప్‌-2022లో భాగంగా హాంగ్‌ కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 40 పరుగుల తేడాతో విజయ భేరి మోగించింది. తద్వారా ఈ మెగా టోర్నీలో సూపర్‌-4కు టీమిండియా ఆర్హత సాధించింది. కాగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో గోల్డన్‌ డక్‌గా వెనుదిరిగిన రాహుల్‌.. ఈ మ్యాచ్‌లో కూడా నిరాశపరిచాడు.

39 బంతులు ఎదుర్కొన్న రాహుల్‌ 36 పరుగులు మాత్రమే చేశాడు. అయితే రాహుల్‌ ఇన్నింగ్స్‌ టెస్టు మ్యాచ్‌ను తలపిస్తూ సాగింది. ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచే  హాంగ్‌ కాంగ్‌ బౌలర్లను ఎదర్కొవడంలో రాహుల్‌ విఫలమయ్యాడు. ముఖ్యంగా స్పిన్నర్లను ఎదుర్కొవడానికి రాహుల్‌ చాలా ఇబ్బంది పడ్డాడు.

అఖరికి స్పిన్నర్‌ మొహమ్మద్ ఘజన్‌ఫర్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి రాహుల్‌ పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో రాహుల్‌పై నెటిజన్లు తీవ్ర విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. 'ఏంటి రాహుల్‌ ఇది.. టెస్టు ఇన్నింగ్స్‌ బాగా ఆడావు' అంటూ కామెంట్‌ చేశాడు.

కాగా గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చాక రాహుల్‌ అంతగా రాణించలేకపోతున్నాడు. గత నెలలో జింబాబ్వేతో జరిగిన సిరీస్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన రాహుల్‌ తీవ్రంగా విఫలమయ్యాడు. ఈ సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌ చేసిన రాహుల్‌ కేవలం 30 పరుగులు మాత్రమే చేశాడు.

చదవండి: Asia Cup 2022 Ind Vs HK: ఆరేళ్ల తర్వాత కింగ్‌ కోహ్లి బౌలింగ్‌.. అభిమానులు ఫిదా!

మరిన్ని వార్తలు