ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సిక్కి రెడ్డి–ప్రణవ్‌ జంట

25 Mar, 2021 01:29 IST|Sakshi
సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా

పారిస్‌: ఓర్లియాన్స్‌ మాస్టర్స్‌ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా (భారత్‌) జంట ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్‌ ద్వయం 21–7, 21–18తో డొమినిక్‌–సెరెనా (ఆస్ట్రియా) జోడీపై గెలిచింది. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సైనా నెహ్వాల్‌ 21–9, 21–5తో రాచెల్‌ (ఐర్లాండ్‌)పై, ఐరా శర్మ 12–21, 21–14, 21–17తో లియోనైస్‌ (ఫ్రాన్స్‌)పై నెగ్గి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరారు. పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో  కిడాంబి శ్రీకాంత్‌ 21–15, 21–10తో భారత్‌కే చెందిన అజయ్‌ జయరామ్‌పై, కిరణ్‌ జార్జి 13–21, 21–16, 23–21తో సహచరుడు ప్రణయ్‌పై, చిరాగ్‌ సేన్‌ 21–13, 21–12తో చికో వార్దోయో (ఇండోనేసియా)పై గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగుపెట్టారు. మరో రెండో రౌండ్‌ మ్యాచ్‌లో పారుపల్లి కశ్యప్‌ 7–21, 17–21తో తోమా జూనియర్‌ పొపోవ్‌ (ఫ్రాన్స్‌) చేతిలో ఓడిపోయాడు.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు