సిక్కి రెడ్డికి ‘నెగెటివ్‌’ 

16 Aug, 2020 04:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత మహిళల డబుల్స్‌ స్టార్‌ షట్లర్‌ నేలకుర్తి సిక్కి రెడ్డికి, బ్యాడ్మింటన్‌ బృందం ఫిజియోథెరపిస్ట్‌ చల్లగుండ్ల కిరణ్‌కు ఊరట లభించింది. ఈనెల 7న గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్‌ అకాడమీలో జాతీయ శిక్షణ శిబిరం ప్రారంభమైన సందర్భంగా భారత స్పోర్ట్స్‌ అథారిటీ (సాయ్‌) నిబంధనల ప్రకారం శిబిరంతో సంబంధమున్న క్రీడాకారులకు, కోచ్‌లకు, సహాయక సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో సిక్కి రెడ్డి, కిరణ్‌లకు కరోనా పాజిటివ్‌ రాగా... ఇతరులకు నెగెటివ్‌ వచ్చింది. అయితే పాజిటివ్‌ వచ్చిన సిక్కి రెడ్డి, కిరణ్‌లో కరోనా లక్షణాలు లేకపోవడంతో శుక్రవారం మళ్లీ స్థానిక కార్పొరేట్‌ ఆసుపత్రిలో శిబిరంతో సంబంధమున్న వారందరూ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈసారి సిక్కి రెడ్డి, కిరణ్‌లకు కరోనా ‘నెగెటివ్‌’ ఫలితం వచ్చింది. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు