తనిష్క్‌ బృందానికి రజతం

30 Oct, 2023 01:16 IST|Sakshi

చాంగ్వాన్‌ (దక్షిణ కొరియా): ఆసియా షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఆదివారం భారత్‌కు రెండు రజత పతకాలు లభించాయి. జూనియర్‌ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌లో తెలంగాణ ప్లేయర్‌ కొడవలి తనిష్క్‌ మురళీధర్‌ నాయుడు, రాజ్‌కన్వర్‌ సింగ్‌ సంధూ, సమీర్‌లతో కూడిన భారత జట్టు రెండో స్థానంలో నిలిచింది. తనిష్క్‌ (569), సమీర్‌ (573), రాజ్‌కన్వర్‌ (579) బృందం ఓవరాల్‌గా 1721 పాయింట్లు స్కోరు చేసి రజత పతకం కైవసం చేసుకుంది.

పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ ప్రోన్‌ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్‌ జాహిద్‌ హుస్సేన్‌ రజత పతకం సొంతం చేసుకున్నాడు. జాహిద్‌ 624.5 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. మరో మూడు రోజులపాటు కొనసాగే ఈ చాంపియన్‌íÙప్‌లో ప్రస్తుతం భారత్‌ 8 స్వర్ణాలు, 12 రజతాలు, 5 కాంస్యాలతో కలిపి మొత్తం 25 పతకాలతో రెండో స్థానంలో ఉంది.   

మరిన్ని వార్తలు