Simone Biles: ‘అథ్లెట్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ సిమోన్‌ బైల్స్‌

15 Dec, 2021 08:07 IST|Sakshi

విఖ్యాత టైమ్‌ మేగజైన్‌ 2021కి గానూ ‘అథ్లెట్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా అమెరికన్‌ స్టార్‌ జిమ్నాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌ను ఎంపిక చేసింది. నాలుగుసార్లు ఒలింపిక్‌ పతక విజేత అయిన బైల్స్‌ టోక్యో ఒలింపిక్స్‌ సమయంలో తాను ‘ద ట్విస్టీస్‌’తో బాధపడుతున్నట్లు చెప్పి నాలుగు బంగారు పతక ఈవెంట్ల నుంచి తప్పుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అనంతరం అమెరికా జిమ్నాస్టిక్స్‌ టీమ్‌ మాజీ డాక్టర్‌ ల్యారీ నాసర్‌ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ సెనేట్‌ ముందు సాక్ష్యం చెప్పింది. 

మరిన్ని వార్తలు