SL Vs Pak 1st Test: ఇది టెస్టు మ్యాచ్‌.. టీ20 కాదు.. వాళ్లిద్దరిని ఎందుకు సెలక్ట్‌ చేయలేదు?

16 Jul, 2022 15:47 IST|Sakshi
పాక్‌ జట్టు (PC: Sri Lanka Cricket)

పాకిస్తాన్‌ మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డ కమ్రాన్‌ అక్మల్‌

SL Vs Pak 1st Test- “It’s a Test match, not a T20 game” - Kamran Akmal: రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడేందుకు పాకిస్తాన్‌ ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తోంది. ఈ క్రమంలో శనివారం(జూలై 16) గాలే వేదికగా మొదటి మ్యాచ్‌ ఆరంభమైంది. టాస్‌ గెలిచిన ఆతిథ్య శ్రీలంక జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. 

పాక్‌ బౌలర్లు షాహిన్‌ ఆఫ్రిది మూడు వికెట్లు, హసన్‌ అలీ రెండు, యాసిర్‌ షా రెండు వికెట్లతో చెలరేగారు. నసీమ్‌ షా, మహ్మద్‌ నవాజ్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు. దీంతో మూడో సెషన్‌ సమయానికి లంక 9 వికెట్లు నష్టపోయి 200 పరుగులు చేసింది. మహీశ్‌ తీక్షణ, కసున్‌ రజిత క్రీజులో ఉన్నారు.

ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌ తుదిజట్టులో ఫవాద్‌ ఆలం, ఫాహీమ్‌ అష్రఫ్‌లకు చోటు ఇవ్వకపోవడంపై పాకిస్తాన్‌ మాజీ వికెట్‌ కీపర్‌ కమ్రాన్‌ అక్మల్‌ మండిపడ్డాడు. ఇదేమీ టీ20 మ్యాచ్‌ కాదు.. టెస్టు క్రికెట్‌ అంటూ మేనేజ్‌మెంట్‌ను విమర్శించాడు. 

ఈ మేరకు ట్విటర్‌ వేదికగా.. ‘‘ఇది టెస్టు మ్యాచ్‌.. టీ20 గేమ్‌ కాదు... చాలా మంది ఆల్‌రౌండర్లు ఆడుతున్నట్లున్నారు.. నిజానికి టెస్టు క్రికెట్‌కంటూ కొంతమంది స్పెషలిస్టులు ఉంటారు. ఫవాద్‌ ఆలం, ఫాహీమ్‌ అష్రఫ్‌లను శ్రీలంకతో మ్యాచ్‌కు ఎందుకు తప్పించడం నన్ను విస్మయానికి గురిచేసింది’’ అని కమ్రాన్‌ అక్మల్‌ పేర్కొన్నాడు.

కాగా ఆలం ఇప్పటి వరకు 18 టెస్టులాడి 986 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి. ఇక బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ ఫాహీమ్‌ 14 టెస్టు మ్యాచ్‌లలో 24 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా 636 పరుగులు సాధించాడు. ఇలా ఇద్దరూ టెస్టు క్రికెట్‌లో సత్తా చాటారు. ఈ నేపథ్యంలో కమ్రాన్‌ అక్మల్‌ ఈ మేరకు ట్వీట్‌ చేయడం గమనార్హం.

శ్రీలంకతో మొదటి టెస్టు ఆడుతున్న పాక్‌ జట్టు:
అబ్దుల్లా షఫిక్‌, ఇమామ్‌ ఉల్‌ హక్‌, అజర్‌ అలీ, బాబర్‌ ఆజం(కెప్టెన్‌), ఆఘా సల్మాన్‌, మహ్మద్‌ రిజ్వాన్‌(వికెట్‌ కీపర్‌), మహ్మద్‌ నవాజ్‌, యాసిర్‌ షా, హసన్‌ అలీ, షాహిన్‌ ఆఫ్రిది, నసీమ్‌ షా.

శ్రీలంక తుదిజట్టు:
ఒషాడో ఫెర్నాండో, దిముత్‌ కరుణరత్నె(కెప్టెన్‌), కుశాల్‌ మెండిస్‌, ఏంజెలో మాథ్యూస్‌, ధనుంజయ డి సిల్వా, దినేశ్‌ చండిమాల్‌, నిరోషన్‌ డిక్‌విల్లా(వికెట్‌ కీపర్‌), రమేశ్‌ మెండిస్‌, మహీశ్‌ తీక్షణ, ప్రభాత్‌ జయసూర్య, కసున్‌ రజిత.

చదవండి: Lalit Modi- Sushmita Sen: తనకంటే తొమ్మిదేళ్లు పెద్దది.. మినాల్‌ను పెళ్లాడేందుకు లలిత్‌ ఫైట్‌! చివరికి ఇలా!

మరిన్ని వార్తలు