SL Vs WI- Dimuth Karunaratne: శ్రీలంక కెప్టెన్‌ అరుదైన ఘనత.. రెండో ఓపెనర్‌గా

25 Nov, 2021 17:01 IST|Sakshi
PC: Sri Lanka Cricket

SL Vs WI- Dimuth Karunaratne jumps to second spot for most runs by Sri Lankan openers in Tests: వెస్టిండీస్‌తో మ్యాచ్‌ సందర్భంగా శ్రీలంక టెస్టు కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నే అరుదైన రికార్డు సాధించాడు. లంక తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఓపెనర్‌గా నిలిచాడు. 137 ఇన్నింగ్స్‌లో 5374 పరుగులు సాధించి సనత్‌ జయసూర్య(5932) తర్వాతి స్థానం దక్కించుకున్నాడు. మరో 558 పరుగులు చేస్తే జయసూర్య రికార్డును కరుణరత్నే అధిగమిస్తాడు. ఇక ఈ జాబితాలో తర్వాతి మూడు స్థానాల్లో మర్వన్‌ ఆటపట్టు (5317), దిల్షాన్‌(2170), ఆర్‌ఎస్‌ మహానామా(2069) ఉన్నారు. 

ఇదిలా ఉండగా.. ఈ క్యాలెండర్‌(2021) ఇయర్‌లో టెస్టుల్లో అత్యధిక సాధించిన ఆటగాళ్ల జాబితాలో కరుణ రత్నే(854) మూడో స్థానంలో ఉన్నాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు ఉండటం విశేషం. అత్యధిక స్కోరు 244. ఇక ఈ జాబితాలో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌(1455), టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(906) టాప్‌-2లో కొనసాగుతున్నారు.

కాగా గాలే స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో కరుణ రత్నే సారథ్యంలోని శ్రీలంక జట్టు వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 187 పరుగుల తేడాతో విండీస్‌పై గెలుపొందింది. కెప్టెన్‌ కరుణ రత్నే తొలి ఇన్నింగ్స్‌లో 147, రెండో ఇన్నింగ్స్‌లో 83 పరుగులు సాధించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

చదవండి: Babar Azam- Ban Vs Pak: నేను ప్రతిసారీ పరుగులు సాధించాలని ఎక్కడా రాసిలేదు.. కచ్చితంగా రాణిస్తా

మరిన్ని వార్తలు